Runa Mafi: రైతులకు గుడ్ న్యూస్.. ఈ రోజే వారి ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము..
రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుండి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు మొత్తం జమకానుంది. శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నగరంలోని బీఆర్‌కేఆర్ భవన్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 42 బ్యాంకుల అధికారులు భేటీకి హాజరయ్యారు.
అయితే, ఈ మొత్తం ఈ నెల 16వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమకానుంది. రాష్ట్రంలోని ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనున్నారు. బ్యాంకర్లు రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయొద్దని… పూర్తిగా రుణ మాఫీ ఖాతాలోనే ఈ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం. రుణ మాఫీ జరిగిన రైతుల ఖాతాల్లో జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ. 50 వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగష్టు 15 వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారు. ఆగష్టు 16 వ తేదీ నుంచే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,006 కోట్లు జమ అవుతాయి.
ఇవి కూడా చదవండి: Pak PM Imran Khan: ఆ ఫోన్ కోసమే పాకిస్తాన్ ప్రధాని ఎదురు చూపులు.. ఈ విరహ వేదన ఎంతకాలం
పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. తాగాల్సింది ఇదే.. ఆ రుచే వేరప్ప అంటున్న బీర్ ప్రియులు
