AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water War: తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న జల యుద్ధం.. ఏపీ, తెలంగాణ మధ్య లెటర్స్ వార్

తెలుగు రాష్ట్రాల జల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ రెండూ లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి వరుస లేఖలు రాస్తూ వాటర్ వార్ ను కొనసాగిస్తున్నారు.

Water War: తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న జల యుద్ధం.. ఏపీ, తెలంగాణ మధ్య లెటర్స్ వార్
Telugu States Water War
Sanjay Kasula
|

Updated on: Aug 25, 2021 | 2:17 PM

Share

తెలుగు రాష్ట్రాల జల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ రెండూ లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి వరుస లేఖలు రాస్తూ వాటర్ వార్ ను కొనసాగిస్తున్నారు. కృష్ణా జలాలను చెరి సగం పంచాలంటూ తెలంగాణ రాసిన లేఖకు ఏపీ ప్రభుత్వం కౌంటరిచ్చింది. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారమే నీటి పంపకాలు జరగాలని డిమాండ్ చేసింది. 2021-22కి 70-30శాతం లెక్కన కృష్ణా జలాలు కేటాయించాలని కేఆర్ఎంబీని కోరింది.

కృష్ణా జలాలను 50-50శాతం కింద కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీ అభిప్రాయం కోరింది కేఆర్ఎంబీ. తెలంగాణ డిమాండ్ పై అభ్యంతరం తెలిపిన ఏపీ సర్కార్… 70-30 నిష్పత్తిలోనే కేటాయింపులు చేయాలంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వాటాలు ప్రాజెక్టుల వారీగా జరగలేదని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది ఆంధ్రప్రదేశ్. కేవలం… చెన్నై, హైదరాబాద్ తాగునీటి విషయంలో మాత్రమే కొన్ని నిబంధనలు ఉన్నాయన్న ఏపీ సర్కార్… మిగతాదంతా పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరింది.

50-50 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలన్న తెలంగాణ డిమాండ్ సహేతుకం కాదంటోంది ఏపీ. శ్రీశైలం నుంచి చెన్నైకు… సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీటి కోసం మాత్రమే నీళ్లను తీసుకునేందుకు వెసులుబాటు ఉందని ఏపీ చెబుతోంది. ప్రస్తుతం, రాష్ట్రానికి 1059 టీఎంసీల నీటి అవసరం ఉందని కేఆర్ఎంబీకి లేఖ రాసింది ఏపీ. కృష్ణా జలాల్లో ఏపీ వాటా నుంచి ఆ నీటిని వెంటనే కేటాయించాలని కోరింది.

ఇవి కూడా చదవండి: దిల్ మాంగే మోర్.. రిస్క్ ఎలాంటిదైనా ఇవి ఉండాల్సిందే.. కేబుల్ నుంచి భారతీయుల తరలింపులో వీటిదే కీ రోల్..

Viral Video: ఇవేంటిరా ఇంత శ్రద్ధగా దాడి చేశాయి..అతడు సినిమా డైలాగ్‌ను గుర్తు చేసిన మొసలి.. ఇది చూసిన నెటిజన్లు షాక్..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌