ర్యాంప్ వాక్ చేస్తూ రఫ్పాడిస్తున్న నాయకులు.. ప్రజంట్ ట్రెండ్ ఇదే గురూ..

ఈ మధ్య పొలిటికల్ మీటింగ్స్‌లో మీరు ఓ కొత్త కల్చర్‌ను గమనించారా..? నేతలు ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ప్రజలకు చేరువగా వెళ్లి వారికి అభివాదం చేస్తున్నారు. లీడర్ అంటే జనానికి చేరువవ్వాలి అనే మాటను నిజం చేస్తున్నారు. ర్యాంప్ వాక్ పొలిటికల్ సభలు ప్రజెంట్‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ట్రెండ్‌గా మారాయి.

ర్యాంప్ వాక్ చేస్తూ రఫ్పాడిస్తున్న నాయకులు.. ప్రజంట్ ట్రెండ్ ఇదే గురూ..
Rahul Gandhi

Edited By:

Updated on: Apr 06, 2024 | 8:58 PM

ఈ మధ్య పొలిటికల్ మీటింగ్స్‌లో మీరు ఓ కొత్త కల్చర్‌ను గమనించారా..? నేతలు ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ప్రజలకు చేరువగా వెళ్లి వారికి అభివాదం చేస్తున్నారు. లీడర్ అంటే జనానికి చేరువవ్వాలి అనే మాటను నిజం చేస్తున్నారు. ర్యాంప్ వాక్ పొలిటికల్ సభలు ప్రజెంట్‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ట్రెండ్‌గా మారాయి. ర్యాంప్ వాక్ రాజకీయాలతో రఫ్పాడిస్తున్నారు పొలిటికల్‌ లీడర్స్‌. గతంలో D ఆకారంలో ఉండే రాజకీయ సభలు కాస్తా.. ర్యాంప్‌ వాక్ సభలుగా మారాయి. దేశంలో ఇప్పుడు ఏ ఎన్నికల ప్రచారవేదిక చూసినా ఇదే ట్రెండ్‌గా నడుస్తోంది. గతంలో సభలకు వెళ్లిన కార్యకర్తలు.. దూరం నుంచి తమ అభిమాన నేతను చూడలేకపోయామన్న బాధను వ్యక్తపరిచేవారు. ప్రజంట్ ర్యాంప్ సభల ద్వారా ఆ ఫీలింగ్ పొగొట్టేశారు. 200 నుంచి 300 మీటర్లు వరకు ర్యాంప్ ఏర్పాటు చేసి.. అక్కడ కలియతిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తున్నారు లీడర్స్.

తొలుత తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ తరహా సభలకు ఆద్యం పోశారు. ఆ తర్వాత సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. ఈ ర్యాంప్ కల్చర్‌ను పతాకస్థాయికి తీసుకెళ్లింది మాత్రం సీఎం జగనే. ఇప్పుడు ఆయన ఏ సభ పెట్టినా భారీ ర్యాంప్ ఉండాల్సిందే. కార్యకర్తలకు బూస్ట్ తెచ్చే ఈ ట్రెండ్‌ను ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. ప్రాంతీయ పార్టీల నేతల నుంచి నేషనల్ పార్టీల లీడర్స్ వరకూ అందరూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. తుక్కుగూడలో జరగిన కాంగ్రెస్‌ జనజాతర సభలోనూ ర్యాంప్‌ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు సెక్యూరిటీ ఇబ్బందులు ఎదురవుతున్నా.. భద్రతా ఏజెన్సీల నుంచి వద్దని సూచనలు వస్తున్నా.. నేతలు మాత్రం కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు. తమకు ప్లేస్, క్రేజ్, పవర్ ఇచ్చిన ప్రజలకు దూరంగా ఉండమంటే ఏ నాయకుడు ఒప్పుకుంటారు చెప్పండి. అందుకే ఇలా ర్యాంప్ వాక్ ట్రెండ్ రాజకీయ సభలకు కొత్త కళను తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…