అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం.. అటవీశాఖ హెచ్చరిక..
భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో పెద్ద పులి హడలెత్తిస్తోంది..మారుమూల ఏజెన్సీ గ్రామం కావడి గాండ్ల లో ఇంట్లో ఉన్న రెండు ఆవులను చంపి తినింది. సమీప అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట ఏజెన్సీ లో మారుమూల కావడిగుండ్ల గిరిజన గ్రామంలో పెద్దపులి సంచరిస్తుంది..ఓ ఇంటి ఆవరణ లో కట్టేసి ఉన్న రెండు ఆవులను చంపి తినింది..దీనితో సమీప గ్రామాల ప్రజలు హడలెత్తి పోతున్నారు..అశ్వారావుపేట మండలం,కావాడిగుండ్ల గ్రామానికి చెందిన సోడెం.నాగేశ్వరరావు తన 10 ఆవులను ఇంటి ముందు ఉన్న తన జామాయిల్ తోటలో కట్టివేసి పడుకున్నారు..ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో బయట ఆవుల అరుపులు, పులి గాండ్రిపులు తన తల్లికి వినబడ్డాయనీ ఆయన తెలిపారు.
ఉదయం లేచి పెరట్లోకి వెళ్లి చూడగా ఆవు ఒకటి చనిపోయింది..ఒక దూడ కనిపించకుండా పోయింది. సమీపంలోని వాగు వద్ద దూడ కూడా చనిపోయి ఉందని, ఆవుల గొంతు వద్ద పులి దాడి చేసిన గుర్తులు ఉన్నాయని భాదత రైతులు చెప్పారు. వెంటనే విషయం గ్రామమంతా తెలిసింది. పెద్దపుల్లి గ్రామంలో సంచరిస్తుందని తెలిసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళన లో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. విషయం తెలుసుకొని అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించగా పులి అడుగుజాడలు కనిపించాయి. ఆ జాడలను బట్టి పెద్దపులి గా గుర్తించామని, ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. ఈ అడవి పాపికొండల అభయారణ్యం తో ఎక్కువ విస్తీర్ణం ఉంటుందని, పెద్దపులి ఒక ఆవును, దూడను చంపి రక్తం తాగి వెళ్లిందని చెప్పారు. అంతేకాకుండా మరొక ఆవుల మంద లో అవుపై కూడా దాడి చేసే సమయంలో ఆవు అడవిలోకి పారిపోయినట్టుగా చెప్పారు. చనిపోయిన ఆవులు కుళ్లిపోయిన తరువాత వాటి మాంసం తినటం కోసం మళ్లీ వస్తుందని, వీటి జాడ కోసం ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
అటవీశాఖ సిబ్బంది నిరంతరం గస్తీ ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో సుమారు 9 గ్రామాలు ఉన్నాయని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటికి సాయంత్రం త్వరగా చేరుకోవాలని, పొలంలో పనిచేసేవారు గుంపులు గుంపులు గా ఉండాలని, పులి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




