AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jatara: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ్యత సంపాదించుకున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రంగం సిద్దంమైంది. ఈ నెల 28వ తేదీ నుంచి జాతర ప్రారంభం కానుంది. 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జాతర జరగనుంది. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Venkatrao Lella
|

Updated on: Jan 21, 2026 | 10:26 AM

Share
తెలంగాణ మహా కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్దమైంది. ఈ సారి అత్యంత గ్రాండ్‌గా జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. రూ.కోట్ల ఖర్చు చేసి ఆధునీకరణ పనులు చేపట్టింది. మేడారంకు వెళ్లే రోడ్లను అభివృద్ది చేసింది.  ఈ సారి భారీగా దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో అట్టహాసంగా నిర్వహించాలని చూస్తోంది.

1 / 5
ఈ క్రమంలో మేడారంకు భక్తులు సులువుగా చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నడూ లేనతంగా ఈ సారి జాతరకు ఏకంగా 4 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి ఈ బస్సులను తిప్పనుంది. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ఈ బస్సులకు మేడారంకు తిరగనున్నాయి.

2 / 5
2024లో జాతర కోసం 3,491 బస్సులను ప్రవేశపెట్టగా.. 16.82 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. ఈ సారి అంతకంటే ఎక్కువగా భక్తుల రద్దీ ఉండే అవకాశముండటంతో బస్సుల సంఖ్యను పెంచారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ ప్రత్యేక బస్సులు తిప్పనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.

3 / 5
మేడారంలో 50 ఎకరాల్లో్ తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు అయింది. అలాగే 9 కిలోమీటర్ల పొడవుతో 50 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లలో 20 వేల మంది ఒకేసారి నిలబడవచ్చు. ఇక ప్రయాణికుల కోసం రెస్ట్ రూమ్స్, వేచి ఉండేందుకు కూర్చీలు, అలాగే వాటర్ లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. బస్సుల పార్కింగ్ కోసం 26 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు.

4 / 5
ఇక మేడారం జాతరకు తిరిగే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే ఫ్రీ జర్నీ సౌకర్యం మహిళలకు ఉంటుంది. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని,. మహిళలు యధావిధిగా ఉపయోగించుకోవచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!