AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. నువ్వు నేను సినిమా విషయంలో జరిగింది ఇదే.. డైరెక్టర్ తేజ..

డైరెక్టర్ తేజ సినిమాలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ప్రేమకథ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా దివంగత హీరో ఉదయ్ కిరణ్, డైరెక్టర్ తేజ కాంబోలో వచ్చిన చిత్రాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు తేజ అంతగా సినిమాలను తెరకెక్కించడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. నువ్వు నేను సినిమా విషయంలో జరిగింది ఇదే.. డైరెక్టర్ తేజ..
Director Teja
Rajitha Chanti
|

Updated on: Jan 21, 2026 | 10:53 AM

Share

డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఆయన తన కెరీర్, సినీప్రముఖులతో అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ శాశ్వతమని ఏదీ లేదని.. వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారని అన్నారు. ఎన్టీఆర్, ఎస్వీ రంగరావు, సావిత్రి వంటి దిగ్గజ నటీనటుల కారణంగానే ఇండస్ట్రీ నిలబడిందని అన్నారు. తేజ దర్శకుడిగా పరిచయమైన సినిమా చిత్రం. ఈ మూవీకి ముందుగా వేరే హీరో అనుకున్నా అని.. చివరకు ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయమయ్యాడని అన్నారు. ఉదయ్ కిరణ్ అమాయకుడు.. మంచివ్యక్తి అని.. ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

చిత్రం సినిమాను కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. సరిగ్గా 31 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశామని అన్నారు. అలాగే నువ్వు నేను సినిమాకు ముందుగా మాధవన్ ను హీరోగా అనుకున్నానని అన్నారు. అప్పుడు అతడు తెలుగు సినిమాలు చేయనని చెప్పడంతో ఆయన స్థాయంలో ఉదయ్ కిరణ్ ను తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. హీరోయిన్ ఎంపికలో ఒక డిమాండ్ చేసే అమ్మాయిని కాదని.. ప్రేమ గుడ్డిది.. అందం, గిందం.. కులం.. గోత్రం ఏమీ చూడదనే డైలాగ్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. చెన్నైలో పెరిగినందుకు తనకు తెలుగులో పెద్ద పెద్ద పదాలు రావని.. అందుకే తన సినిమాల్లో సాధారణ తెలుగు పదాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

తన ప్రేక్షకులు రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, యువత, మధ్య తరగతి ప్రజలు మాత్రమే ఉంటారని.. అందుకే వారికి అర్థమయ్యే భాషలో సినిమాలు రూపొందించడమే తన లక్ష్యమని అన్నారు. రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత శివ, క్షణక్షణం వంటి చిత్రాలకు పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఆర్జీవీ తనను కెమెరామెన్ గా మార్చారని అన్నారు. తెలుగులో అనేక సినిమాలు చేసి ముంబై వెళ్లి అక్కడి హిందీ సినిమాలకు కథలు అందించానని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..