AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దమ్ముంటే నిరూపించండి.. కేటీఆర్, రేవంత్ రెడ్డిలకు రాజగోపాల్ రెడ్డి ఓపెన్ సవాల్..

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మార్క్ కామెంట్స్‌తో ప్రత్యర్థి నేతలపై విరుచుకుపడ్డారు. తాను అమ్ముడుపోయానంటూ మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై,,

Telangana: దమ్ముంటే నిరూపించండి.. కేటీఆర్, రేవంత్ రెడ్డిలకు రాజగోపాల్ రెడ్డి ఓపెన్ సవాల్..
Komatireddy Venkat Reddy
Shiva Prajapati
|

Updated on: Mar 05, 2023 | 10:12 AM

Share

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మార్క్ కామెంట్స్‌తో ప్రత్యర్థి నేతలపై విరుచుకుపడ్డారు. తాను అమ్ముడుపోయానంటూ మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీవారి సన్నిధి సాక్షిగా ప్రత్యర్థి పార్టీల నేతలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ‘శ్రీవారి సాక్షిగా చెపుతున్నా .. ఎవరికీ అమ్ముడుపోలేదు’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రూ. 18వేల కోట్లకు అమ్ముడు పోయినట్లు నిరూపించాలంటూ ప్రత్యర్థి పార్టీల నేతలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రూ. 18 వేల కోట్లు రాజకీయ విమర్శలకు దారితీసాయి. తనపై ప్రత్యర్థి పార్టీల నేతలు చేసిన ఆరోపణలకు దీటుగా మరోసారి మాటల తూటాలు పేల్చారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఓపెన్ సవాల్ విసిరారు. వారిద్దరూ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. తిరమల వెంకన్న సాక్షిగా తనను కోనే శక్తి ఇంకా పుట్టలేదని.. పుట్టబోదని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.

మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేశారు రాజగోపాల్ రెడ్డి. కవిత జైలుకి వెళ్లడం పక్కా అంటూ జోస్యం చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మునుగోడు ఉపఎన్నికలో బయటపడిందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ప్రజా వ్యతిరేకత నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని విమర్శించారు. ఉప ఎన్నిక సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం చేశారని.. అయినా ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు రాజగోపాల్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..