Telangana: రాయల తెలంగాణ నినాదంపై మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రాయలసీమ ఉద్యమాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లాలని ఆ ప్రాంత నేతలు భావిస్తున్నారు. రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షకు కొంతమంది నేతలు హాజరయ్యారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండుగడుతూనే రాయల తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు.
రాయలసీమ ఉద్యమాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లాలని ఆ ప్రాంత నేతలు భావిస్తున్నారు. రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దీక్షకు కొంతమంది నేతలు హాజరయ్యారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండుగడుతూనే రాయల తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే ఈ నినాదంపై తెలంగాణ నేతలు భగ్గుమంటున్నారు. రాయల తెలంగాణ నినాదం నిలబడదని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకుల లోపం కారణంగానే రకరకాల డిమాండ్లు వస్తున్నాయంటూ మండిపడ్డారు.
గతంలో కూడా రాయల తెలంగాణ కావాలంటూ చాలా డిమాండ్లు వచ్చాయని వాటన్నింటిని తెలంగాణ సమాజం తిరస్కరించిదని స్పష్టం చేశారు. మరోవైరు రాయల తెలంగాణ నినాదం అనేది ఓ నాటకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రాయల తెలంగాణ అవసరం లేదని పేర్కొన్నారు. ఏపీలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తారని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం.