AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR-KTR Meeting: ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం.. కేసీఆర్‌తో కేటీఆర్‌ కీలక భేటీ!

KCR-KTR Meeting: ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు వెళ్లిన కేటీఆర్ తండ్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కమిషన్ నోటీసుల అంశంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై చర్చించారు..

KCR-KTR Meeting: ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం.. కేసీఆర్‌తో కేటీఆర్‌ కీలక భేటీ!
Subhash Goud
|

Updated on: May 25, 2025 | 9:18 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం రేపుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందని చర్చ మొదలైంది. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కేటీఆర్ తన తండ్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కవిత అసంతృప్తి, ఆమె రాసిన లేఖలోని అంశాలపై చర్చించేందుకు కేసీఆర్, కేటీఆర్ భేటీ అయ్యారు.

ఈ అంశాలతో పాటు కేసీఆర్‌కి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై, తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ పోరాట ఫలితంగా రాష్ట్ర అవతరణ అని నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సైతం వీరు చర్చించారని సమాచారం. దాదాపు రెండు గంటల పాటు కేసీఆర్‌- కేటీఆర్‌ మధ్య సమావేశం జరిగింది.

ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇటీవల రాసిన లేఖ బహిర్గతమైంది. అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దేవుడన్నారు. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. కవితకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందా, లేక తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించిన బీజేపీని బీఆర్ఎస్ ప్లీనరీలో ఏం అనలేదని ఆవేదన వ్యక్తం చేశారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది.

పార్టీ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, ఎవరైనా తమ పార్టీ అధినేత దృష్టికి తమ అభిప్రాయాలు తీసుకెళ్లే స్వేచ్ఛ ఉందన్నారు కేటీఆర్‌.

ఇది కూడా చదవండి: Amukesh Ambani: అంబానీ ఇంట్లో రోజుకు 4 వేల రోటీల తయారీ.. చెఫ్‌కు జీతం ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్