AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిసెంబర్ 4న కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. సీఎంవో ప్రకటన

ఓట్ల జాతర ఒడిసింది. ఒడ్డెక్కదెవరు? ఓడెదెవరు. డిసెంబర్‌ 3 రిజల్ట్‌ డేపైనే ఇప్పుడు అందరి దృష్టి. అన్నిపార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా.. మరికొన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇకపోతే పోలీంగ్‌ డే జనజాతరను తలపించింది.

డిసెంబర్ 4న కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. సీఎంవో ప్రకటన
CM KCR
Ram Naramaneni
|

Updated on: Dec 01, 2023 | 3:46 PM

Share

డిసెంబర్ 4న కేబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు సీఎంవో తెలిపింది. దీన్ని బట్టి విజయంపై సీఎం కేసీఆర్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు అర్థమవుతుంది. నవంబర్ 30న అసెంబ్లీ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

ఓట్ల జాతర ఒడిసింది. ఒడ్డెక్కదెవరు? ఓడెదెవరు. డిసెంబర్‌ 3 రిజల్ట్‌ డేపైనే ఇప్పుడు అందరి దృష్టి. అన్నిపార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా.. మరికొన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇకపోతే పోలీంగ్‌ డే జనజాతరను తలపించింది. ఓటర్లు పల్లెబాట పట్టడంతో పట్నం బోసిపోయింది. ఓటింగ్‌లో అది రిఫ్లెక్టయింది. అర్బన్‌ ఏరియాలతో పోలిస్తే రూరల్‌లో ఈసారి పోలీంగ్‌ గ్రాఫ్‌ లేచింది. కొన్ని చోట్ల పెరిగిన ఓటింగ్ ఎవరికి ప్లస్‌.. కొన్ని తగ్గిన పోలింగ్‌ ఎవరికి మైనస్‌ అనే లెక్కలేయడం కూడా షురూ అయింది.

హైదరాబాద్‌ ఓటరు మహాశయుడు ఇంటికే పరిమితం

హైదరాబాద్‌ జిల్లాలో పోలింగ్‌ అత్యంత దారుణంగా ఉంది. ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా ఓటరు మహాశయుడు ఇంటికే పరిమితం అయ్యాడు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని సౌకర్యాలని ఎంజాయ్‌ చేసే.. ఈ సదరు ఓటరు.. పోలింగ్‌ బూత్‌కు రావడానికి మొరాయించాడు. రోడ్లు బాగుండాలి.. డ్రైనేజీలు సాఫ్‌గా ఉండాలి.. 24 గంటల కరెంటు.. ఇంటింటికీ టంచన్‌గా నల్లా నీరు రావాలి. ట్రాన్స్‌పోర్ట్‌కి బస్సులు, మెట్రోలు.. ట్రాఫిక్‌ కంట్రోల్‌కి ఫ్లైఓవర్లు.. వీకెండ్‌ ఎంజాయ్‌ చేయడానికి మల్టీప్లెక్సులు, పార్కులు.. పబ్బులుండాలి.. ఎనీటైమ్‌ పేమెంట్‌ కోసం 5జీ స్పీడ్‌ నెట్‌ ఉండాలి. ఇందులో ఏ ఒక్కటీ తగ్గినా ప్రభుత్వాన్ని నిందించడానికి క్యూలో మొదట నిలబడేది ఈ హైదరాబాద్‌ ఓటరు మహాశయుడే. సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ చేసేది కూడా వీళ్లే. కాని ఓటు వేయడానికి మాత్రం రారు.

వీళ్లు ఓట్లేసినా.. లేకపోయినా ఎవరో ఒక నేత గెలుస్తాడు. కాని ఉన్నవారిలో ది బెస్ట్‌ను ఎన్నుకుందామన్న సెన్స్‌ ఉండాలి కదా? హైదరాబాద్‌ అభివృద్ధి చెందాలి అంటే.. విజన్‌ ఉన్న నాయకులకు పట్టం కట్టాలి కదా? తమ ఏరియాల్లో ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యేని నిందించడమే పనిగా పెట్టుకుంటారు కాని.. ఓటు వేసి సమర్థుడిని ఎన్నుకుంటే సమస్యలు తలెత్తకుండా చూసుకుంటాడు కదా? ఒక్కసారైనా ఆలోచించి.. ఒక్క గంట మనది కాదు.. రాష్ట్ర భవిష్యత్‌ది అనుకుని వేలుకి ఇంక్‌ అంటించుకుని వస్తే.. ఆ తర్వాత ఐదేళ్లు రిలాక్స్‌ అవ్వొచ్చు కదా? హైదరాబాద్‌ ఓటరు మహాశగా.. దీనితో అయిపోలేదు. ఇంకా భవిష్యత్‌లో ఎన్నో ఎన్నికలు రాబోతున్నాయి. ఇకనైనా మేలుకుని.. మన తలరాతల్ని మార్చే ఓటుని గట్టిగా వేయాలని కోరుకుంటూ… మీ టీవీ9 వినమ్ర విజ్ఞప్తి ఇది.

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..