AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో దేవుడా ఎంత విషాదం.. రేగిపళ్ల కోసమని వెళ్తే..

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. రేగు పండ్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేమాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

Telangana: అయ్యో దేవుడా ఎంత విషాదం.. రేగిపళ్ల కోసమని వెళ్తే..
Karimnagar Tragedy
Anand T
|

Updated on: Feb 11, 2026 | 5:19 PM

Share

రేగిపళ్ల కోసమని వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. ఉదయం పొలానికి వెళ్లిన స్థానిక రైతులు బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితిసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఈర్నాల శ్రీనివాస్, శారద దంపతులకు రాజూ అనే 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. రాజూ మంగళవారం సాయంత్రం రేగిపళ్ల కోసమని గ్రామం సమీపంలోని పొలాల వద్దకు వెళ్లాడు. అక్కడే ఒక రేగి చెట్టువద్ద రేగిపళ్లు తెంచుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలు జారి పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో రాజూ నిగమునిగి ప్రాణాలు కోల్పోయాడు.

అయితే రాత్రి అయినా రాజూ ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు రాజు కోసం ఊరు మొత్తం గాలించారు. కానీ రాత్రి వారికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఉదయం మళ్లీ రాజూ కోసం గాలింపు చేపట్టగా గ్రామ సమీపంలో ఉన్న ఓ బావిలో రాజు మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. వెంటనే బావిలోంచి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.