Bandi Sanjay: బండి సంజయ్ దూకుడు. గ్రామ స్థాయిని నుండి పార్టీ బలోపేతంపై దృష్టి
కరీంనగర్ నుంచి బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు తెలిపారు. సుమారుగా ముప్పై వేల మంది కార్యకర్తలతో భారీ సమ్మేళనాన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని భావించారు. అయితే అత్యవసర కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉన్నందున, ఆదివారం జరగాల్సిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం వాయిదా వేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.

భారతీయ జనతా పార్టీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన ప్రచారంలో దూకుడు పెంచారు. అదివారం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు స్పష్టం చేశారు. సుమారుగా ముప్పై వేల మంది కార్యకర్తలతో భారీ సమ్మేళనాన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని భావించారు. అయితే అత్యవసర కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉన్నందున, ఆదివారం జరగాల్సిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం వాయిదా వేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.
కరీంనగర్ పార్లమెంటు స్థానంలో అప్పుడే ఎన్నికల వేడి పుట్టింది. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. మరోసారి కరీంనగర్ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేయాలని భావిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి కరీంనగర్ పార్లమెంటు స్థానంపై దృష్టి పెట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా, ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.
ఈసీటుపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోకస్ పెట్టాయి. అయితే ఆ రెండు పార్టీల కంటే ప్రచారంలో ముందుండాలని బండి సంజయ్ హాడావుడి మొదలు పెట్టారు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వాల్ రైటింగ్, అయోధ్య బాల రాముడు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా భారీగా శ్రీరాముడి కటౌట్లు ఏర్పాట్లు చేశారు. ఆదివారం కరీంనగర్ లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని భావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అమిత్ షా హాజరు కావల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఎన్నికల శంఖారావం వాయిదా వేస్తున్నట్లు సంజయ్ ప్రకటించారు. తదుపరి సమావేశ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇక ముందుగా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికల రణరంగంలోకి దిగాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు.
కరీంనగర్ పార్లమెంటులో సంజయ్ కుమార్‌కు గెలుపు అత్యధికంగా కీలకం. అయన రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి వైదొలిగిన తరువాత పూర్తిగా కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా గెలుపు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పార్లమెంటు స్థానంపైనా అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటుగా ప్రతిపక్ష పార్టీ బీఅర్ఎస్ కాచుకుని కూర్చున్నాయి. ఇప్పటికే కేటీఆర్ సోషల్ మీడియా వారియర్స్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసారి లోక్ సభ ఎన్నికలు త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉండడంతో ఏడు అసెంబ్లీ స్థానాలపై పోకస్ పెట్టింది బీజేపీ.
అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిన ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. నాలుగు స్థానాలలో కాంగ్రెస్, మూడు స్థానాలలో బీఅర్ఎస్ విజయం సాధించిన నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి కరీంనగర్ పార్లమెంటు స్థానంపై ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




