AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zaheerabad Politics: హ్యాట్రిక్ కలిసిరాలేదని గులాబీ బాస్ భావిస్తున్నారా.. ఆ సిట్టింగ్ ఎంపీకి టికెట్ లేదని చెప్పేశారా..?

ఆ సిట్టింగ్ ఎంపీకి హ్యాట్రిక్ కలిసిరాదని గులాబీ పార్టీ భావిస్తోందట. ఈసారి ఆ స్దానానికి కొత్త అభ్యర్ధి కోసం వెతుకులాట ప్రారంభించిందట. సిట్టింగ్‌లలో కొందరికే టికెట్లు అంటూ క్లారిటీ ఇవ్వడంతో, ఆ సీటుపై కన్నేసి ఓ పెద్దాయన నాకు కావాలి.. అంటూ పట్టుబడుతున్నారట. ఇంతకీ ఏ సిట్టింగ్ ఎంపీకి సీటు గండం పొంచి ఉంది.. ఆ సీటు పై కన్నేసిన ఆ పెద్దాయన ఎవరూ..?

Zaheerabad Politics: హ్యాట్రిక్ కలిసిరాలేదని గులాబీ బాస్ భావిస్తున్నారా.. ఆ సిట్టింగ్ ఎంపీకి టికెట్ లేదని చెప్పేశారా..?
Former Cm Kcr
Prabhakar M
| Edited By: |

Updated on: Jan 27, 2024 | 8:15 PM

Share

ఆ సిట్టింగ్ ఎంపీకి హ్యాట్రిక్ కలిసిరాదని గులాబీ పార్టీ భావిస్తోందట. ఈసారి ఆ స్దానానికి కొత్త అభ్యర్ధి కోసం వెతుకులాట ప్రారంభించిందట. సిట్టింగ్‌లలో కొందరికే టికెట్లు అంటూ క్లారిటీ ఇవ్వడంతో, ఆ సీటుపై కన్నేసి ఓ పెద్దాయన నాకు కావాలి.. అంటూ పట్టుబడుతున్నారట. ఇంతకీ ఏ సిట్టింగ్ ఎంపీకి సీటు గండం పొంచి ఉంది.. ఆ సీటు పై కన్నేసిన ఆ పెద్దాయన ఎవరూ అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.

కామారెడ్డి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్ధానాల్లో విస్తరించి ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ స్దానానికి గులాబీ పార్టీ సిట్టింగ్ అభ్యర్ధిని మారుస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోందట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీ రామారావు జహీరాబాద్ పార్లమెంట్ సమీక్షలో సిట్టింగ్ ఎంపీని మారుస్తున్నట్లు హింట్ కూడా ఇచ్చారని టాక్ నడుస్తోంది. కామారెడ్డి జిల్లా సిర్పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త బీబీ పాటిల్ ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు.. బీబీ పాటిల్ దేశంలోనే అతి స్వల్ప మెజార్టీతో గెలిచారు. మరోసారి పోటీకి ఆయన సైతం అంతగా ఆసక్తి చూపడం లేదని పార్టీలో ప్రచారం జరుగుతుంది.

జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సిట్టింగ్ స్దానం కాపాడుకోవాలని భావిస్తున్న గులాబీ పార్టీ.. ఎంపీ అభ్యర్ధిగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అన్వేషిస్తోందట. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్షలో కేటీఆర్ చేసిన వాఖ్యలు బీబీ పాటిల్ వర్గీయులను షాక్ కు గురిచేశాయట. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తప్పిదం చేయమని కీలక వ్యాఖ్యలు చేశారట. దీంతో ఈ సెగ్మెంట్ లో సిట్టింగ్ కు టికెట్టు లేదని చెప్పకనే చెప్పేశారట.

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నాలుగు అసెంబ్లీ స్దానాలు ఉండగా. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు సెగ్మెంట్లు జహీరాబాద్, ఆందోల్, నారాయణ ఖేడ్ ఉన్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీబీ పాటిల్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా విజయం సాధించారు. అయితే రెండోసారి అతి కష్టంగా గెలిచారు. రాష్ట్రంలో అత్యల్ప మెజార్టీతో గెలిచిన స్దానాల్లో జహీరాబాద్ ఒకటిగా ఉందట. బీబీ పాటిల్‌కు జిల్లా నేతలతో సమన్వయం అంతగా ఉండదన్న టాక్ వినిపిస్తోంది. ఫలితంగా ఆయన ఎక్కవ సమయం సంగారెడ్డి జిల్లాకు కేటాయిస్తారని నాలుగు నియోజకవర్గాల గులాబీ శ్రేణులు గుర్రుగా ఉన్నారట.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ పాటిల్ కాంట్రిబ్యూషన్ పెద్దగా ఏమిలేదని అందరూ పెదవి విరుస్తున్నారట. సిట్టింగ్ ఎంపీని మారుస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో అక్కడి నుంచి పోటీ చేయించేందుకు.. ప్రముఖ బిల్డర్ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి, పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోందట. అసెంబ్లీ ఎన్నికల్లో సుభాష్ రెడ్డి పని చేసిన తీరుతో సంతృప్తిగా ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ సుభాష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. వీరితో పాటు ఆ పార్లమెంట్ పరిధిలో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కూడా సుభాష్ రెడ్డి పేరును బలంగా ప్రతిపాదిస్తున్నారట.

ఇక ఇప్పటికే సుభాష్ రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలలో ఉండటం, కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఆరు కోట్ల రూపాయల సొంత నిధులతో నిర్మించిన పాఠశాల తరహాలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రతి మండలంలో అలాంటి పాఠశాల నిర్మించే ప్రతిపాదనతో ముందుకు వెళ్లాలని అనే ఆలోచనలో ఉన్నారట. అటు బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా చర్చలు జరుపుతున్నారట. జహీరాబాద్ పార్లమెంట్ స్ధానంపై గులాబీ జెండా ఎగరాలంటే అభ్యర్ధి మార్పు అనివార్యమనే చర్చ జరుగుతోందట. ఆయనకు టికెట్ రాకుండా జిల్లాకు చెందిన కీలక నేతలు చక్రం తిప్పుతుండటం కొసమెరుపు..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…