AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జెండాకో ఇరిగేషన్ ఎజెండా..! ఈసారి చిచ్చు పేరు కన్నెపల్లి మోటార్లు

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకుని తెలంగాణలో సాగునీటి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. పంపులను వెంటనే ఆన్ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుండగా, డ్యామ్ భద్రతా కారణాల వల్ల ఇప్పుడే నీటి ఎత్తిపోతలు సాధ్యం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ వివాదంలో బీజేపీ కూడా రంగంలోకి దిగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Telangana: జెండాకో ఇరిగేషన్ ఎజెండా..! ఈసారి చిచ్చు పేరు కన్నెపల్లి మోటార్లు
Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Jul 06, 2026 | 9:50 PM

Share

ఇక్కడ ఎవరి ఇరిగేషన్ వాళ్లదే. దాదాపు లక్షకోట్ల విలువైన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌.. ఇప్పుడొక కామెడీ ఎపిసోడ్‌గా మారిపోయింది. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, కొంప కొల్లేశ్వరం అని సూటిపోటి మాటలతో ఎవరి కటింగులు వాళ్లిస్తున్నారు. సీజనుకోసారి రాజకీయ పార్టీలు కొట్లాడుకోడానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్‌గా మాత్రమే పనికొస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు. కట్టినవాళ్లకు ఎంతటి అమూల్యమైన ప్రాజెక్టో, తర్వాత పవర్లోకొచ్చిన వీళ్లకు మాత్రం అంతకంటే అనాకారీ ప్రాజెక్ట్ ఐపోయింది. గ్రౌండ్‌లో రైతుజనాభా అభిప్రాయాలకు విరుద్ధంగా పరస్పరం పొలిటికల్ కుమ్ములాటలకే పరిమితమైంది కాళేశ్వరం. కారు పార్టీ వర్సెస్ క్యాబినెట్ మంత్రులు.. మధ్యలో కమలం సార్లు.. కుమ్మేసుకుందాం రేంజ్‌లో నడుస్తోంది తెలంగాణలో సాగు రాజకీయం.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాల్సిందేనని బీఆర్‌ఎస్ పార్టీ, డ్యామ్‌సేఫ్టీ అధికారుల హెచ్చరికల్ని బేఖాతరు చేసి నీళ్ళు ఎలా వదులుతామని హస్తం పార్టీ.. రెండూ కలిసి డ్రామాలాడుతున్నాయని కమలం పార్టీ…! టీ-పాలిటిక్స్‌లో వద్దన్నకొద్దీ ఉట్టిపడుతోంది జలకళ. నీళ్లు-నిలదీతలు- నిరసనల నిప్పుతో అట్టుడుగుతోంది తెలంగాణ. మంత్రులు-మాజీ మంత్రులే ఇరిగేషన్ ఇంజనీర్ల అవతారమెత్తి, నీటి విడుదలపై సొంత పెర్ఫామెన్సులతో ఇరగదీస్తున్నారు, మీడియా మీటింగులు పెట్టి అదేపనిగా లెక్చర్లు దంచికొడుతున్నారు. ఎవరికి వాళ్లు జల ఫిరంగుల్ని సంధిస్తున్నారు. కేటీఆర్ కన్నెపల్లి టూరుతో మళ్ళీ మొదలైంది అసలు రచ్చ. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌ దగ్గర గోదావరి నదీ ప్రవాహాన్ని పరిశీలించడానికి ఆదివారం టూరేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖరీఫ్ సీజన్ మొదలై నెలరోజులు దాటుతున్నా కాళేశ్వరం...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
కలలో బంగారం, డబ్బు లేదా వెలుగు కనిపిస్తే ఏం జరుగుతుంది? సంపద రాక
కలలో బంగారం, డబ్బు లేదా వెలుగు కనిపిస్తే ఏం జరుగుతుంది? సంపద రాక
మీ ఐఫోన్ బ్యాటరీని ఏ యాప్ ఎక్కువగా తీసుకుంటుంది? తెలుసుకోండిలా?
మీ ఐఫోన్ బ్యాటరీని ఏ యాప్ ఎక్కువగా తీసుకుంటుంది? తెలుసుకోండిలా?
ఎయిర్ షోలో కుప్పకూలిన F-4 యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి!
ఎయిర్ షోలో కుప్పకూలిన F-4 యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి!
టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్.. 3 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం
ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్య
ఇంట్లో చక్కెరను ఇలా పెడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్థిక సమస్య
కొత్త బాలెనో కేవలం రూ. 6.10 లక్షలకే.. అద్భుతమైన డిజైన్‌, ఫీచర్స్
కొత్త బాలెనో కేవలం రూ. 6.10 లక్షలకే.. అద్భుతమైన డిజైన్‌, ఫీచర్స్
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్
సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్
ఏడాదిలో అత్యంత శుభయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక అదృష్టమే అదృష్టం!
ఏడాదిలో అత్యంత శుభయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక అదృష్టమే అదృష్టం!