“రేవంత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. మళ్లీ గెలిచే సత్తా ఉంది”: క్రాస్‌ఫైర్‌లో కడియం కీలక వ్యాఖ్యలు!
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణ రాజకీయాలు, పార్టీల భవిష్యత్తుపై ఆసక్తికర విశ్లేషణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణ రాజకీయాలు, పార్టీల భవిష్యత్తుపై ఆసక్తికర విశ్లేషణలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పథకాలతో పాటు మరికొన్ని కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం, కేసీఆర్ హయాంలోనే విపరీతంగా రుణాలు తీసుకోవడం మరియు కేంద్రం నుండి సరైన సాయం అందకపోవడమే దీనికి కారణమన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దన్న కడియం శ్రీహరి, రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచే సత్తా ఆయనకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే అది కాంగ్రెస్‌కే పెద్ద అడ్వాంటేజ్‌గా మారుతుంది అని కడియం విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ లేదా బీజేపీలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అవుతాయని తాను భావించడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని, ప్రస్తుతం ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్‌ను ఖతం చేస్తేనే తమకు ఉనికి ఉంటుందని బీజేపీ భావిస్తోందని, కాబట్టి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం లేదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
