Women’s Day: థీమ్ పార్క్ వండర్లాలో విహరించాలనుకునే మహిళకు మహిళా దినోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్.. వివరాల్లోకి వెళ్తే
International Womens Day: హైదరాబాద్(Hyderabad) పరిధిలోని శంషాబాద్(Shamshabad) లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న వండర్లా( Wonderla )హైదరాబాద్ అమ్యూజ్‌మెంట్ పార్క్ ను..
International Womens Day: హైదరాబాద్(Hyderabad) పరిధిలోని శంషాబాద్(Shamshabad) లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న వండర్లా( Wonderla )హైదరాబాద్ అమ్యూజ్‌మెంట్ పార్క్ ను సందర్శించడానికి మహిళలకు ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు థీమ్ పార్క్‌లో సరదాగా విహరించేందుకు హైదరాబాద్ వండర్‌లా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మహిళలు రూ.1049 ధరతో ప్రవేశ టిక్కెట్లపై ఒక+ఒక ఆఫర్‌ను అందిస్తోంది. మహిళలు ఒక టిక్కెట్‌ను కొనుగోలు చేస్తే.. ఆ టికెట్ కు అదనంగా మరో టికెట్ ను ఉచితంగా పొందవచ్చు. అంటే.. రూ. 1049 లకు ఇద్దరు మహిళలు వండర్లా అమ్యూజ్‌మెంట్ పార్క్ ను సందర్శించ వచ్చు. మహిళలు తమ స్నేహితురాళ్ళతో లేదా.. తమ మహిళా కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ వెళ్ళడానికి ఈ థీమ్ పార్కును ఎంచుకోవచ్చు. ఒక్క రోజు ఈ థీమ్ పార్క్‌లో ఉల్లాసంగా, ఉల్లాసంగా గడిపేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వినోద పార్క్ లో ప్రపంచ స్థాయి రైడ్‌ల్లో విహరించవచ్చు.
అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న.. ఈ వండర్లా పార్క్ లో 10 ఏళ్లు పైబడిన పురుషులను అనుమతించదు. ఈ ఆఫర్ ఆన్‌లైన్ బుకింగ్‌తో పాటు వాక్-ఇన్‌లకు అందుబాటులో ఉంది. ఒక్క మహిళా సందర్శకులకు మాత్రమే ఈ ఆఫర్ అందిస్తోంది. అంతేకాదు మార్చి 8న పురుషుల కోసం బుక్ చేసిన టిక్కెట్లు ఉంటే అవి రద్దు చేయబడతాయి.
ఇక కరోనా నిబంధనలను అనుసరిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన అవసరమైన మార్గదర్శకాలను ఈ థీమ్ పార్క్ పాటిస్తోందని థీమ్ పార్క్ అధికారులు చెప్పారు. పార్క్ పరిశుభ్రత, భద్రతా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు పార్క్ కు వచ్చే అతిథులు.. రైడ్‌లు, రెస్టారెంట్లు, క్యూ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోనున్నమని చెప్పారు. ఈ ఆఫర్ గురించి ఎవరికైనా మరిన్ని వివరాలకు కావాల్సి ఉంటే 8414676333/8414676339 నంబర్లలో సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read: