Hyderabad: బైక్ రేసింగ్‌లతో యువకుల హల్‌చల్‌.. భాగ్యనగరంలో 8 మంది అరెస్టు

Hyderabad Bike Racing: ప్రమాదాలు జరుగుతున్న వారిలో మార్పు రావడం లేదు. ఖరీదైన బైకులపై మితిమీరిన వేగంతో దూసుకుపోతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇతరుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.

Hyderabad: బైక్ రేసింగ్‌లతో యువకుల హల్‌చల్‌.. భాగ్యనగరంలో 8 మంది అరెస్టు
Bike Race
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 03, 2022 | 7:39 AM

Hyderabad Bike Racing: ప్రమాదాలు జరుగుతున్న వారిలో మార్పు రావడం లేదు. ఖరీదైన బైకులపై మితిమీరిన వేగంతో దూసుకుపోతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇతరుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్‌ కావాలన్న కాంక్షతో అడ్డదారులు తొక్కుతున్నారు యువకులు. అర్దరాత్రి రోడ్లపై ప్రాణాలకు తెగించి బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. లైక్‌ల కోసం లైఫ్‌నే రిస్క్‌లో పెడుతున్నారు కొందరు యువకులు. బైక్‌ రేసర్ల చేష్టలతో భయబ్రాంతులకు గురవుతున్నారు తోటి ప్రయాణికులు. తాజాగా బైక్‌ రేసర్లపై ఉక్కుపాదం మోపారు (Hyderabad Police) హైదరాబాద్‌ పోలీసులు. ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేశారు నార్త్ జోన్ పోలీసులు. అంబర్ పేటకు చెందిన ప్లవర్ డెకరేటర్ మహమ్మద్ అల్తాఫ్, అదే ప్రాంతానికి చెందిన ఎండీ అజమ్, మహమ్మద్ అశ్వాక్, ఎం.డి. ఓమర్, సయ్యద్ అలీమ్, సయిద్, ఎండి.అన్వర్, ఎండి. జమీల్‌లతో పాటు తాడుబండ్‌కు చెందిన షేక్ చాంద్‌లు ముఠాగా ఏర్పడ్డారని చెప్పారు నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి. వీరు సోషల్ మీడియాలో ఫేమస్ అయి డబ్బులు సంపాదించాలనుకున్నారని, అల్తాఫ్ బైక్ రేసింగ్ చేస్తుండగా, మిగితా వారు అల్తాఫ్‌ను బైక్‌లపై వెంబడిస్తూ వీడియోలు తీస్తుండే వారని చెప్పారు.

తాజాగా వీరంతా అంబర్ పేట నుంచి హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, ప్యారడైజ్ మీదుగా బేగంపేటకు అర్ధరాత్రి చేరుకున్నారని చెప్పారు డీసీపీ చందనా దీప్తి. దీనిపై కొందరు వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని, చెప్పారు దీప్తి. ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లు, ఒక యాక్టీవాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండి.అన్వర్ తప్పించుకున్నాడని చెబుతున్నారు పోలీసులు. వీరి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని స్పష్టం చేశారు డీసీపీ దీప్తి. నగరంలో ఎవరైనా బైక్‌లపై ఫీట్లు చేస్తే చర్యలు తప్పని వార్నింగ్‌ ఇచ్చారు పోలీసులు.

Also Read:

Russia Ukraine War Live Updates: ఉక్రెయిన్‌లోని నగరాల స్వాధీనం దిశగా రష్యా సైన్యం.. తిరగబడుతున్న స్థానిక యువత..

UP Assembly Election 2022 Voting Phase 6 Live: అందరిచూపు సీఎం సీటు వైపే.. యూపీలో ఆరో విడత పోలింగ్ ప్రారంభం..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్