PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? రేపే చివరి తేదీ..
PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్యూన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్‌లో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారంతో గడువు..
PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్యూన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్‌లో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ పోస్టులకు విద్యార్హత ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 24 ప్యూన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు ఇంగ్లిష్‌లో ప్రాథమికంగా చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-01-2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను పంజాబ్ నేషనల్ బ్యాంక్, సర్కిల్ ఆఫీస్, రీజెన్సీ ప్లాజా, 1వ అంతస్తు, మైత్రీ విహార్ ఏరియా, అమీర్‌పేట్, హైదరాబాద్ 500016 అడ్రస్‌ను పంపించాలి.
* అభ్యర్థులను ముందుగా ప్రకటనలో సూచించిన అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్ చేసిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 14,500 నుంచి రూ. 28,145లతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 04-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Janasena-TDP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ వెనుక ఆంతర్యం అదేనా.. ఆసక్తికర కథనం మీకోసం..!