AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేసన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో...

AIIMS Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Aiims Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 03, 2022 | 6:20 AM

AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేసన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో సీనియర్‌ రెసిడెంట్లు/ సీనియర్‌ డెమాన్‌ స్ట్రేటర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాల కోసం మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 09 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, జనరల్‌ సర్జరీ, పార్మకాలజీ, రేడియోడయాగ్నసిస్‌, పీడియాట్రిక్స్‌ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ/ మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట అకడమిక్‌ అర్హత, పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* దరఖాస్తు చేసుకునే ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ. 500, ఇతరులు రూ. 1000 ఫీజులగా చెల్లించాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూను, ధర్మశాల బిల్డింగ్‌, ఎయిమ్స్‌ మంగళగిరిలో 31-03-2022 తేదీన నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా.. పక్క బాత్రూమ్ నుంచి వీడియో తీసి.. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

Central Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారా.. అయితే మీ కోసమే ఈ వార్త..

Home Loan: హోమ్‌లోన్ తీసుకున్నారా.. ఈ పనిచేస్తే ప్రతినెలా రూ.5000 తగ్గుతోంది..!