బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా.. పక్క బాత్రూమ్ నుంచి వీడియో తీసి.. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

ఆడవాళ్లు, యువతులు, చిన్నారులపై రోజు రోజుకు అకృత్యాలు(Harassment) పెరిగిపోతున్నాయి. లైంగిక వాంఛతో ప్రబుద్ధులు నేరాలకు పాల్పడుతున్నారు. వయసు, ప్రదేశం వంటివేవీ పట్టించుకోకుండా..

బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా.. పక్క బాత్రూమ్ నుంచి వీడియో తీసి.. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం
Harassment
Follow us

|

Updated on: Mar 02, 2022 | 9:21 PM

ఆడవాళ్లు, యువతులు, చిన్నారులపై రోజు రోజుకు అకృత్యాలు(Harassment) పెరిగిపోతున్నాయి. లైంగిక వాంఛతో ప్రబుద్ధులు నేరాలకు పాల్పడుతున్నారు. వయసు, ప్రదేశం వంటివేవీ పట్టించుకోకుండా వేధిస్తున్నారు. తాజాగా తండ్రి ఆస్పత్రి పాలవడంతో అతనికి సహాయంగా ఉండేందుకు వచ్చిన కూతురితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె స్నానం చేస్తున్న సమయంలో సెల్ ఫోన్ తో వీడియో(video) తీశాడు. బాధితురాలు గమనించి కేకలు వేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ.. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా బాధితురాలి తరఫు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు(Protest at Hospital) దిగారు. ఆస్పత్రి బాత్రూమ్ లో సరైన భద్రత లేకపోవడాన్ని బయటపెట్టే వీడియోలు స్థానికంగా వైరల్ కావడంతో చివరికి పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. తెలంగాణలోని పెద్దపెల్లి జిల్లా కొలనూరుకు చెందిన ఓ వ్యక్తి.. అనారోగ్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతనికి సహాయంగా కూతురు ఆస్పత్రిలోనే ఉంటోంది.

ఈ క్రమంలో యువతి స్నానం చేసేందుకు వెళ్లింది. పక్క బాత్రూంలో నుంచి సెల్ ఫోన్ తో వీడియో చిత్రీకరిస్తుండాన్ని గమనించి కేకలు వేసింది. వెంటనే అక్కడే ఉన్న యువతి తల్లి, సోదరి విషయం తెలుసుకొని పక్క బాత్రూంలోకి వెళ్లగా.. వారికి ఆస్పత్రి సిబ్బందికి చెందిన వ్యక్తి కనిపించాడు. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయితే బాధితుల ఫిర్యాదుపై ఆస్పత్రి యాజమాన్యం భిన్నంగా స్పందించింది. తమ సిబ్బందిది ఏ మాత్రం తప్పు లేదని, బాధితులదే తప్పు అని బుకాయించే ప్రయత్నం చేసింది. వీడియోల విషయం బయటికి తెలిస్తే.. ఆస్పత్రి పరువు పోతుందని భావించి, బాధితులపై తప్పుడు కేసు పెట్టారు. ఆస్పత్రి యాజమాన్యం, పోలీసుల తీరుతో షాక్ తిన్న పేషెంట్ తరఫు బంధువు.. ఆస్పత్రిలో దారుణాలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు.

ఈ ఆస్పత్రిపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. తాజా ఘటనలో బాధితురాళ్లను బెదిరింపులకు గురిచేసిన వైనంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్పత్రి బాత్రూమ్ లో సరైన భద్రత లేకపోవడాన్ని బయటపెట్టే వీడియోలు స్థానికంగా వైరల్ కావడంతో చివరికి పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. వీడియో తీసిన నిందితుడిని మానకొండూరు మండలానికి చెందిన రామగిరి అరవింద్ గా గుర్తించారు. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read

NTPC Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త.. పది, డిప్లొమా అర్హతతో NTPCలో ఉద్యోగాలు..

తోటి హీరోయిన్స్ కు ఛాలెంజ్ గా మారిన బుట్టబొమ్మ.. వరుస అవకాశాలతో..

Pathan: ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించిన బాలీవుడ్ బాద్‌షా.. పఠాన్ రిలీజ్‌ డేట్‌ను చెప్పేసిన షారుఖ్‌..