NTPC Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త.. పది, డిప్లొమా అర్హతతో NTPCలో ఉద్యోగాలు..
NTPC Jobs 2022: NTPC లిమిటెడ్ కంపెనీ మైనింగ్ చీఫ్, మైనింగ్ ఓవర్‌మ్యాన్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. రిక్రూట్‌మెంట్
NTPC Jobs 2022: NTPC లిమిటెడ్ కంపెనీ మైనింగ్ చీఫ్, మైనింగ్ ఓవర్‌మ్యాన్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద 170కి పైగా పోస్టులను భర్తీ చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల నిర్ణీత కాలవ్యవధికి పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 15, 2022. ఆసక్తి గల అభ్యర్థులు NTPC అధికారిక వెబ్‌సైట్ ntpc.co.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులని రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాంచీ, రాయ్‌పూర్, భువనేశ్వర్‌లలో పరీక్ష జరుగుతుంది.
ఖాళీల వివరాలు
1. మైనింగ్ ఓవర్‌మ్యాన్ 74 పోస్టులు
2. మైనింగ్ చీఫ్ 103 పోస్టులు
మైనింగ్ ఓవర్‌మ్యాన్ పోస్టులు: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. DGMS జారీ చేసిన CMR కింద ఓవర్‌మ్యాన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
మైనింగ్ చీఫ్ పోస్ట్: అభ్యర్థులు DGMS జారీ చేసిన హెడ్ సర్టిఫికేట్‌తో పాటు10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
NTPC రిక్రూట్‌మెంట్ 2022 జీతం పరిధి
1. మైనింగ్ ఓవర్‌మెన్: నెలకు రూ. 50,000
2. మైనింగ్ హెడ్: నెలకు రూ. 40,000