నిరుద్యోగులకు గమనిక.. పోలీసు శాఖలో 17 వేల కొలువులు.. లెక్కతేల్చిన అధికారులు..

TS Police Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకి తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ నుంచి తీపి కబురు అందించింది. అధికారులు 17వేల

నిరుద్యోగులకు గమనిక.. పోలీసు శాఖలో 17 వేల కొలువులు.. లెక్కతేల్చిన అధికారులు..
Ts Police Jobs
Follow us
uppula Raju

|

Updated on: Mar 02, 2022 | 7:36 PM

TS Police Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకి తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ నుంచి తీపి కబురు అందించింది. అధికారులు 17వేల ఖాళీలను గుర్తించారు. ఇందులో 16 వేల కానిస్టేబుల్ పోస్టులు, వెయ్యి ఎస్సై పోస్టులు ఉన్నాయి. పోలీస్ శాఖతో సహా వివిధ శాఖల్లో మొత్తం 75 వేల ఖాళీలను కమిటీ గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. డిసెంబర్, 2020లో ప్రభుత్వం 50వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటన చేయగా.. అందులో దాదాపు 20వేల పోలీస్ కొలువులు ఉండనున్నట్లు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయో అధికారులు నిగ్గు తేల్చడం విశేషం.

గతంలో ప్రభుత్వం నుంచి వచ్చిన కొలువుల భర్తీ ప్రకటనతో ఎంతోమంది నిరుద్యోగులు ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. చాలామంది కోచింగ్ సెంటర్లలో చేరారు. కానీ ఏడాది గడిచినా ఇప్పటికీ కొలువుల నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తెలంగాణలో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొలువుల భర్తీపై ఫోకస్ పెట్టే అవకాశం లేకపోలేదు. ఐఏఎస్ కమిటీ నుంచి వివిధ శాఖల్లో ఖాళీలపై నివేదిక అందిన వెంటనే సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలస్యం జరిగినందును కచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో నిరుద్యోగులు మళ్లీ ప్రిపరేషన్ మీద ఫోకస్‌ చేస్తే బాగుంటుంది.

Home Loan: హోమ్‌లోన్ తీసుకున్నారా.. ఈ పనిచేస్తే ప్రతినెలా రూ.5000 తగ్గుతోంది..!

నిరుద్యోగులు పారాహుషార్.. పోలీసు శాఖలో 17 వేల కొలువులు.. లెక్కతేల్చిన అధికారులు..

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓపై నీలినీడలు.. వాయిదా పడే అవకాశం..!