TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు, గమనించారా.?

TS Inter: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల (Telangana Inter) నిర్వహణ విషయంలో ఇంటర్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన పరీక్షల (Inter Exams) షెడ్యూల్‌ను సవరిస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది...

TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు, గమనించారా.?
Ts Inter exams
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 03, 2022 | 6:15 AM

TS Inter: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల (Telangana Inter) నిర్వహణ విషయంలో ఇంటర్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన పరీక్షల (Inter Exams) షెడ్యూల్‌ను సవరిస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. వాస్తవానికి తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు, సెకండ్ ఇయర్‌ పరీక్షలను ఏప్రిల్‌ 21 నుంచి మే 5 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే ఏప్రిల్‌ 21న జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా సవరించి షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 22 నుంచి మే 11 వరకు ఫస్ట్‌ ఇయర్, ఏప్రిల్‌ 23 నుంచి మే 12 వరకు సెకండ్ ఇయర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహిస్తారు. అలాగే ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు.

పరీక్షల పూర్తి టైమ్‌ టేబుల్‌..

ఇంటర్ ఫస్ట్‌ ఇయర్ పరీక్షలు(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు)

2nd లాంగ్వేజ్ పేపర్-I – 22-04-2022

ఇంగ్లీష్ పేపర్-I – 25-04-2022

మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I – 27-04-2022

మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I – 29-04-2022

ఫిజిక్స్ పేపర్-I, అర్థశాస్త్రం పేపర్-I – 02-05-2022

కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ -I – 06-05-2022

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు) – 09-05-2022

మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I – 11-05-2022

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు)

2nd లాంగ్వేజ్ పేపర్-II – 23-04-2022

ఇంగ్లీష్ పేపర్-II – 26-04-2022

మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II – 28-04-2022

మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II – 30-04-2022

ఫిజిక్స్ పేపర్-II, అర్థశాస్త్రం పేపర్-II – 05-04-2022

కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ -II – 07-05-2022

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు) – 10-05-2022

మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II – 12-05-2022

Inter Exams Ts

Inter Exams Ts

Also Read: IPL 2022: CSK జట్టుకు భారీ షాక్.. 14 కోట్ల స్టార్ ప్లేయర్ ఔట్..?

EXIM Bank Jobs: EXIM బ్యాంక్ మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్టులు.. దరఖాస్తు ఎలా చేయాలంటే..