HSL Recruitment: విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం..

HSL Recruitment: విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (HSL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

HSL Recruitment: విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం..
Hsl Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 03, 2022 | 6:30 AM

HSL Recruitment: విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (HSL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

* హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, టెక్నికల్‌, కమర్షియల్‌, సివిల్‌, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఆఫ్‌లైన్‌ మోడ్‌లో పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తు హార్డ్‌ కాపీలను జనరల్‌ మేనేజర్, హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌, గాంధీగ్రామ్‌, విశాఖటపట్నం 530005 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 52,000 నుంచి రూ. 2,20,000 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 30 – ఏప్రిల్‌ 20 వరకు, హార్డ్‌ కాపీలను పంపడానికి ఏప్రిల్‌ 05 – ఏప్రిల్‌ 25గా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: IPL 2022: CSK జట్టుకు భారీ షాక్.. 14 కోట్ల స్టార్ ప్లేయర్ ఔట్..?

ఇంటి బేస్‌మెంట్‌ కింద రహస్య అర.. అందులో ఏముందో చూసిన పోలీసులకు షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

ఇంటి బేస్‌మెంట్‌ కింద రహస్య అర.. అందులో ఏముందో చూసిన పోలీసులకు షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..