Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Election 2022 Voting Phase 6: యూపీలో ముగిసిన ఆరో విడత పోలింగ్.. 53.31 శాతం పోలింగ్ నమోదు..

Shaik Madar Saheb

| Edited By: Shiva Prajapati

Updated on: Mar 03, 2022 | 6:56 PM

Uttar Pradesh Assembly Election 2022 Voting Live Updates: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రీ క్లైమాక్స్‌కు చేరాయి. ఈ రోజు పూర్వాంచల్‌ ప్రాంతంలోని 57 స్థానాల్లో ఆరో దశ పోలింగ్‌ కొనసాగుతోంది..

UP Assembly Election 2022 Voting Phase 6: యూపీలో ముగిసిన ఆరో విడత పోలింగ్.. 53.31 శాతం పోలింగ్ నమోదు..
Up Elections

Uttar Pradesh Assembly Election 2022 Voting Live Updates: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రీ క్లైమాక్స్‌కు చేరాయి. ఈ రోజు పూర్వాంచల్‌ ప్రాంతంలోని 57 స్థానాల్లో ఆరో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. అంబేద్కర్‌ నగర్, బలరాంపుర్‌, సిద్ధార్థ్‌నగర్‌, బస్తీ, సంత్‌ కబీర్‌నగర్‌, మహరాజ్‌గంజ్‌, గోరఖ్‌పుర్‌, కుశీనగర్‌, దేవరియా, బలియా.. 10 జిల్లాలలో ఉన్న మొత్తం 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్‌ జరుగుతోంది. ఈ స్థానాల్లో మొత్తం 676 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆరో దశ ఎన్నికల కోసం 1.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 2.1 కోట్ల మంది ప్రజలు ఓటువేయనున్నారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి పోటీ చేస్తున్న గోరఖ్‌పుర్‌ సిటీ నియోజకవర్గానికి కూడా ఈ రోజు ఎన్నికలు జరగనున్నాయి. సీఎం యోగి మొదటిసారి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేస్తుండంటంతో దీంతో అందరి దృష్టి ఈ సీటుపైనే నెలకొంది.

ఇప్పటివరకు రాష్ట్రంలోని 57 జిల్లాల్లోని 292 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మిగిలిన దశలకు ఈ రోజు, 7 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా.. గురువారం జరిగే ఆరో విడత పోలింగ్‌ అధికార భారతీయ జనతాపార్టీతోపాటు అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న సమాజ్‌వాదీ పార్టీకి కూడా అత్యంత కీలకంగా మారనుంది.

Also Read:

Russia Ukraine War Live Updates: ఉక్రెయిన్‌లోని నగరాల స్వాధీనం దిశగా రష్యా సైన్యం.. తిరగబడుతున్న స్థానిక యువత..

Russia-Ukraine War: పుతిన్‌కు మోదీ ఫోన్ కాల్.. భారతీయులు వెళ్లేందుకు 6 గంటల వెసులుబాటు

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Mar 2022 06:37 PM (IST)

    యూపీలో ముగిసిన పోలింగ్.. పలుచోట్ల ఈవీఎంలకు సీల్ వేసిన అధికారులు..

    యూపీలో 6వ దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేడు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పోలింగ్ జరుగగా.. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. పలు చోట్ల ఎన్నికల అధికారులు ఈవీఎంలకు సీల్ వేసి తరలింపు ప్రక్రియ చేపట్టారు. కాగా, సాయంత్రం 5 గంటల వరకు 53.31 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

  • 03 Mar 2022 06:34 PM (IST)

    ఉత్తరప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు 53.31శాతం పోలింగ్..

    ఉత్తరప్రదేశ్‌లో 6వ దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.31 శాతం పోలింగ్ నమోదైంది.

  • 03 Mar 2022 06:06 PM (IST)

    రష్యా , బెలారసియన్ అథ్లెట్లకు షాక్

    ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా రష్యా , బెలారసియన్ అథ్లెట్లకు చుక్కెదురైంది. బీజింగ్ వింటర్ పారాలింపిక్స్ నుండి నిషేధం విధిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతర్జాతీయ ఒత్తిడి, బహిష్కరణ బెదిరింపులకు తలొగ్గింది చైనా.

  • 03 Mar 2022 04:34 PM (IST)

    యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. సాయంత్రం 3 గంటల వరకు 46.70 శాతం పోలింగ్ నమోదు..

    Uttar Pradesh Elections: ఉత్తరప్రదేశ్‌లో 6వ దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 6వ దశలో యూపీలోని 10 జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండగా.. సాయంత్రం 3 గంటల వరకు 46.70 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.

  • 03 Mar 2022 12:48 PM (IST)

    ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్..

    రాష్ట్రంలోని మొత్తం 10 జిల్లాల్లో ఆరోవిడతలో జరుగుతున్న ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ BD రామ్ తివారీ పేర్కొన్నారు. EVM సంబంధిత ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామంటూ ఆయన వెల్లడించారు.

  • 03 Mar 2022 11:55 AM (IST)

    11 గంటల వరకు 21.79 శాతం పోలింగ్‌

    11 గంటల వరకు 21.79 శాతం పోలింగ్‌ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 21.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

  • 03 Mar 2022 10:48 AM (IST)

    బీజేపీకి 300కి పైగా సీట్లు: రవికిషన్

    గోరఖ్‌పూర్‌ డివిజన్‌లోని మొత్తం 9 స్థానాల్లో విజయం సాధిస్తామని గోరఖ్‌పూర్‌ బీజేపీ ఎంపీ రవికిషన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. పూర్వాంచల్ ప్రాంతంలో పోలింగ్ చరిత్రాత్మకం కానుందని పేర్కొన్నారు. బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయని తెలిపారు. రామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. యూపీ ప్రజలు ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని అభిప్రాయపడ్డారు.

  • 03 Mar 2022 10:04 AM (IST)

    9 గంటల వరకు 8.69 శాతం పోలింగ్‌

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 8.69% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

  • 03 Mar 2022 09:14 AM (IST)

    సీఎం యోగిపై ఎస్పీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే.?

    సీఎం యోగిపై పోటీ చేస్తున్న శుభవతి శుక్లా ఓటు వేశారు. గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా శుభవతి శుక్లా పోటీ చేస్తున్నారు.

  • 03 Mar 2022 08:50 AM (IST)

    ఓటు వేసిన మంత్రులు

    బల్లియా నుంచి పోటీ చేస్తున్న యూపీ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉపేంద్ర తివారీ సైతం బల్లియాలో ఓటు వేశారు.

  • 03 Mar 2022 08:38 AM (IST)

    80 శాతానికి పైగా సీట్లు గెలుచుకుంటాం.. సీఎం యోగి

    ప్రజలంతా బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారని.. అన్ని చోట్లా ఇదే ఉత్సాహం కనిపిస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాజ్యాంగ కర్తవ్యాలపై ప్రజలకు అవగాహన ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. 9 జిల్లాల ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలని విజ్ఞప్తి చేవారు. ఈ ఎన్నికల్లో 80 శాతానికి పైగా సీట్లు సాధించి బీజేపీ రికార్డు సృష్టిస్తుందన్నారు.

  • 03 Mar 2022 07:48 AM (IST)

    66 మంది మహిళా అభ్యర్థుల పోటీ..

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ ఎన్నికల్లో భాగంగా 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆరో దశలో 676 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో 66 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

  • 03 Mar 2022 07:28 AM (IST)

    ఓట్ల పండుగలో పాల్గొనండి.. ప్రధాని మోదీ

    ఉత్తరప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పండుగ నేడు ఆరవ దశకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటర్లందరూ తప్పకుండా ఈ ఉత్సవంలో పాల్గొనాలని ప్రధాని మోదీ కోరారు.

  • 03 Mar 2022 07:18 AM (IST)

    ఓటు వేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్..

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. గోరఖ్‌పూర్ సిటీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన ఉదయాన్నే చేరుకొని ఓటువేశారు.

Published On - Mar 03,2022 7:04 AM

Follow us