UP Elections 2022: ఆరవ దశ పోలింగ్ ప్రశాంతం.. బీజేపీ గత వైభవాన్ని దక్కించుకునేనా?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్ సహా 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది.

UP Elections 2022: ఆరవ దశ పోలింగ్ ప్రశాంతం.. బీజేపీ గత వైభవాన్ని దక్కించుకునేనా?
Up Elections
Follow us

|

Updated on: Mar 03, 2022 | 9:49 PM

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. యూపీ ముఖ్యమంత్రి(UP CM) యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) నియోజకవర్గం గోరఖ్‌పూర్(Gorakhpur) సహా 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అజయ్ కుమార్ శుక్లా తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 53.31 శాతం వరకు పోలింగ్ నమోదైంది.

సాయంత్రం 5 గంటల సమయానికి అంబేద్కర్ నగర్‌‌లో 58.68 శాతం ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో బల్లియాలో 51.74 శాతం ఓటింగ్ నమోదైంది. బలరాంపూర్‌లో సాయంత్రం 5 గంటల వరకు 48.41 శాతం మంది ఓటు వేశారు. బస్తీలో 54.07 శాతం, డియోరియాలో 51.51 శాతం, గోరఖ్‌పూర్‌లో 53.86 శాతం, ఖుషీనగర్‌లో 55.01, మహరాజ్‌గంజ్‌లో 57.48, సంత్ కబీర్ నగర్‌లో 51.14, సిద్ధార్థనగర్‌లో 49.83 శాతం పోలింగ్ నమోదైనట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.

ఆరో దశ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ (గోరఖ్‌పూర్), ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ (బంసి), ప్రాథమిక విద్యా మంత్రి సతీష్ ద్వివేది (ఎత్వా), మాజీ కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య (ఫాజిల్‌నగర్), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ ( తమ్కూహీ రాజ్) భవితవ్యం తేలనుంది. ఈ దశలో కోటి మంది మహిళలు సహా దాదాపు 2.15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ దశలో 66 మంది మహిళలు సహా మొత్తం 676 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యం ఈవీఎంలలో నిర్లిప్తమైంది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రాతినధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్ నియోజకవర్గంతో సహా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను ఆరవ దశలో సున్నితమైనవిగా పోలీసులు పరిగణించారు. వీటిలో బన్సీ, ఎటావా, దుమారియాగంజ్, బల్లియా సదర్, ఫెఫ్నా, బైరియా, సికందర్‌పూర్, బన్సిదాహ్ ఉన్నాయి. గత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 57 స్థానాల్లో 46 బీజేపీ, రెండు దాని మిత్రపక్షాలైన అప్నాదళ్ (ఎస్), సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (సబ్‌ఎస్‌పీ) గెలుచుకున్నప్పటికీ, ఈసారి సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది.

ఆరో దశలో గోరఖ్‌పూర్‌ సదర్‌ సీటు నుంచి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రతిష్ట పణంగా ఉంది. ఇది కాకుండా, రాష్ట్ర ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ సిద్ధార్థనగర్ జిల్లాలోని బన్సీ స్థానంలో బిజెపి అభ్యర్థిగా మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీ అసెంబ్లీ స్పీకర్, SP అభ్యర్థి మాతా ప్రసాద్ పాండే అదే జిల్లాలోని ఇటావా స్థానంలో రాష్ట్ర ప్రాథమిక విద్యా మంత్రి, బిజెపి అభ్యర్థి సతీష్ చంద్ర ద్వివేదిపై పోటీ చేస్తున్నారు. ఖుషీనగర్ జిల్లాలోని పద్రౌనా అసెంబ్లీ స్థానం నుంచి గత సారి బీజేపీ నుంచి గెలుపొంది. దాదాపు ఐదేళ్లపాటు యోగి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్య ఈసారి ఆయన ప్రధాన పోటీ చేసే ఖుషీనగర్‌లోని ఫాజిల్‌నగర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపీకి చెందిన సురేంద్ర కుష్వాహాకు వ్యతిరేకంగా ఉన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి సూర్య ప్రతాప్ షాహి తన పాత ప్రత్యర్థి ఎస్పీకి చెందిన బ్రహ్మశంకర్ త్రిపాఠితో డియోరియా జిల్లాలోని పథర్‌దేవా స్థానంలో పోటీ చేస్తున్నారు. దీంతో పాటు స్వతంత్ర బాధ్యతలు చేపట్టిన సహాయ మంత్రి శ్రీ రామ్ చౌహాన్ (ఖజ్నీ గోరఖ్‌పూర్), రాష్ట్ర మంత్రి జైప్రకాశ్ నిషాద్ (రుద్రపూర్ డియోరియా), జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శలభ్ మణి త్రిపాఠి (డియోరియా) పోటీలో ఉన్నారు.

Read Also….  PM Modi: ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులతో ప్రధాని మోడీ భేటీ.. చిత్రాలు