AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Malla Reddy: విచారణకు రావాలంటూ మంత్రి మల్లారెడ్డికి ఐటీ సమన్లు.. సీజ్ చేసిన నగదు ఎంతంటే..?

ఐటీ శాఖలు సోదాలు చేస్తున్న నేపథ్యంలో..  మంగళవారం తన ఇంటి గేటు దాటి బయటికొచ్చిన మల్లారెడ్డి చేతులు పైకి లేపి చిరునవ్వు చిందించిన ఆయన బుధవారం ఉదయం మాత్రం రాజకీయ కక్ష అంటూ..

Minister Malla Reddy: విచారణకు రావాలంటూ మంత్రి మల్లారెడ్డికి ఐటీ సమన్లు.. సీజ్ చేసిన నగదు ఎంతంటే..?
Mallareddy
శివలీల గోపి తుల్వా
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 24, 2022 | 11:58 AM

Share

మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై నజర్ వేసిన ఐటీ శాఖ.. రెండు రోజుల పాటు సోదాలు చేసింది. తన తనిఖీలలో భాగంగా మల్లారెడ్డి.. ఇంకా ఆయన సన్నిహిత, సమీప బంధువుల ఇళ్లల్లో, మల్లారెడ్డి కార్యాలయాల్లో రైడ్‌లు చేసింది. ఈ సోదాలలో కొంత నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ అధికారులు ఆయన విచారణకు రావాలని మంత్రి మల్లారెడ్డికి సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ఆయన సోమవారం ఐటీ శాఖ కార్యాలయానికి విచారణ కోసం వెళ్లనున్నారు. అయితే, ఐటీ శాఖలు సోదాలు చేస్తున్న నేపథ్యంలో..  మంగళవారం తన ఇంటి గేటు దాటి బయటికొచ్చిన మల్లారెడ్డి చేతులు పైకి లేపి చిరునవ్వు చిందించిన ఆయన బుధవారం ఉదయం మాత్రం రాజకీయ కక్ష అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. రెండో రోజు సోదాల్లో మూడు పరిణామాలు కీలకంగా మారాయి.

మొదటిది.. ప్రీతి రెడ్డికి ఐటీ అధికారుల పిలుపు. ప్రీతి రెడ్డి.. మల్లారెడ్డి కోడలు. ఆమెకు పిలుపు అందగానే ఓ బ్యాగ్‌తో అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే ఆ బ్యాగ్‌లో ఏముంది అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అలాగే మల్లారెడ్డి మనవరాలు శ్రేయను బ్యాంక్‌కి తీసుకెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది.

ఇక రెండోది.. సంతోష్‌ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. సంతోష్‌ రెడ్డి.. మల్లారెడ్డి సమీప బంధువు. ఆయన ఇంట్లో ఏకంగా 4కోట్ల రూపాయలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు డాక్యుమెంట్లను రెట్రివ్ చేశారు. వాటిలో ఏముందన్నది సస్పెన్స్‌గా మారింది. సంతోష్‌ రెడ్డి.. మల్లారెడ్డికి అత్యంత కీలకమైన వ్యక్తి. ఫ్యామిలీకి సంబంధించిన రియల్‌ ఎస్టేట్‌ భూముల కొనుగోళ్ల వ్యవహారాలను ఆయనే చూస్తారు. మల్లారెడ్డి కాలేజీలు, ఆర్థిక వ్యవహారాల్లోనూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారాయన.

ఇవి కూడా చదవండి

మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవహారాలు చూసే ప్రవీణ్‌

ఫైనల్‌గా మూడోది ప్రవీణ్ ఇంట్లో సోదాలు.. నిన్న, ఇవాళ కూడా ఆయన నివాసంలో రెయిడ్స్‌ జరిగాయి. ఉదయం అస్వస్థతతో ఆస్ప్రత్రిలో అడ్మిట్ అయ్యారాయన. ట్రీట్‌మెంట్‌ అనంతరం ఇంటికి తీసుకెళ్లి పలు పత్రాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మల్లారెడ్డి యూనివర్శిటీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రవీణ్‌ రెడ్డే చూస్తారు. ఆయన ఇంట్లో గంటలకొద్ది సోదాలు చేయడం వెనుక ఆంతర్యమేంటన్నది తెలియాల్సి ఉంది.

రూ. 8.80 కోట్లకు పైగా నగదు

ఐటీ ఎటాక్స్‌లో ఇప్పటిదాకా రూ. 8.80 కోట్లకు పైగా నగదు దొరికింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, పన్ను ఎగవేత, మేనేజ్‌మెంట్‌ కోటా కింద సీట్ల అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. విరామం లేకుండా కొనసాగుతున్న సోదాలు ఎప్పుడు ముగుస్తాయన్న చర్చ మాత్రం పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం