Telangana: విద్యార్థుల సంబరం.. తల్లిదండ్రుల సంతోషం.. అంతా సర్కారు సారు వారి మ్యాజిక్..
ఒంట్లో బాగోలేదనో, జ్వరం వచ్చిందనో.. రకరకాల కుంటి సాకులు చెబుతుంటారు. ఇంకొందరు స్కూల్ వెళ్లనంటే వెళ్లనంటూ నానా యాగీ చేస్తారు. గట్టి గట్టిగా ఏడుస్తూ కిందపడి దొర్లుతూ రచ్చ రచ్చ చేస్తారు. ఇలాంటి సందర్భాలు మనం రోజూ ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. ఇందుకు కారణం స్కూల్ టీచర్ కొడతారనో, తమకు ఆడుకునే అవకాశం ఉండదనో.. రకరకాల కారణాలైతే ఉంటాయి. కానీ, ఈ స్కూల్ విషయానికి వస్తే మాత్రం సీన్ రివర్స్ అనే చెప్పాలి. ఇక్కడ స్టూడెంట్స్ స్కూల్‌కి వెళ్లొద్దన్నా వెళ్తారు...

ఖమ్మం, ఆగష్టు 12: సాధారణంగా పిల్లలు స్కూల్‌కు వెళ్లమని మారాం చేస్తుంటారు. పాఠశాల సమయం అవగానే చాలు.. కడుపునొప్పి, ఒంట్లో బాగోలేదనో, జ్వరం వచ్చిందనో.. రకరకాల కుంటి సాకులు చెబుతుంటారు. ఇంకొందరు స్కూల్ వెళ్లనంటే వెళ్లనంటూ నానా యాగీ చేస్తారు. గట్టి గట్టిగా ఏడుస్తూ కిందపడి దొర్లుతూ రచ్చ రచ్చ చేస్తారు. ఇలాంటి సందర్భాలు మనం రోజూ ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. ఇందుకు కారణం స్కూల్ టీచర్ కొడతారనో, తమకు ఆడుకునే అవకాశం ఉండదనో.. రకరకాల కారణాలైతే ఉంటాయి. కానీ, ఈ స్కూల్ విషయానికి వస్తే మాత్రం సీన్ రివర్స్ అనే చెప్పాలి. ఇక్కడ స్టూడెంట్స్ స్కూల్‌కి వెళ్లొద్దన్నా వెళ్తారు. ఇంట్లో ఉండటం కంటే స్కూ్ల్‌లోనే బాగుంటుందని చెబుతారు పిల్లలు. మరి ఆ స్కూల్‌లో అంతలా ఆకర్షిస్తున్న అంశం ఏంటి? ఆ స్కూల్ స్పెషాలిటీ ఏంటి?
అది సర్కారు బడి.. ఆ బడిలో.. డాన్సులు వేస్తూ.. పాటలు పాడుతారు.. పిల్లలకు మాంచి ఎంటైర్‌టైన్మెంట్ ఇస్తారు. అలాగని చిల్లరమల్లర ఎంటర్‌టైన్మెంట్ కాదండోయ్.. పక్కా పనికొచ్చే ఎంటర్‌టైన్మెంటే. తరగతి గదుల్లో డాన్సులు చెయ్యటమెంటి అనుకుంటే పొరపాటే. ఆ ఆటలు, పాటలతోనే.. విద్యాబుద్దులు నెరుపుతున్నారు అక్కడి అద్యాపకులు. అవును, ఆటలు, పాటలు, డ్యాన్సులతో విద్యార్థులను వెరైటీగా విద్యా బోధనలు చెపుతున్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలకు ఆట పాటలతో.. ఒక మాస్టారు విన్నూత్నంగ పాఠాలు చెప్పడంతో పిల్లలు ఆకర్షితులై క్రమం తప్పకుండా ఆ సర్కారు బడికే వెళ్తున్నారట. వెరైటీ గా పాఠాలు నేర్పుతున్న మాస్టారు డాన్స్ గురించి, అలా ఎందుకు చేస్తున్నారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే మరి..
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని చౌడవరం గ్రామంలోని సర్కారు బడి అది. ఇక్కడ ఈ సర్కారు బడిలో ప్రధానోపాధ్యాయుడుగా కుంటముక్కల నాగంజనేయులు పని చేస్తున్నాడు. మొక్కై వంగనిది మానై ఒంగదు.. అంటుంటారు. అందుకే సామాజిక భాద్యతగా.. చిన్నతనం నుంచే పిల్లల్లో సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగేలా, సమాజం పట్ల బాధ్యత, పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ కలిగి ఉండేలా విద్యాబోధనలు చెపుతుంటాడు. వయసులో పెద్ద వాడైనా.. స్కూల్‌కు రాగానే ప్రైమరీ విద్యార్థులతో కలిసి చిన్న పిల్లాడిలా.. పిల్లలను ఆకర్షించే ఆట పాటలతో పాఠాలు నేర్పుతుంటాడు. తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ రైమ్స్.. దేశ భక్తి గీతాలతో పిల్లల్లో చైతన్యం నింపేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు అక్కడి ప్రధానోపాధ్యాయుడు నాగంజనేయులు.




‘ఈ మాస్టారు వచ్చాకా మా పిల్లలలో చాలా మార్పు వచ్చింది.. పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉండటమే కాకుండా చదువులోనూ, ఆట పాటల లోనూ ముందుంటున్నారు’ అని పిల్లల తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చిన్న వయసులోనే యోగాసనాలు కూడా నేర్పుతున్నారని వారు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
