AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జాతీయ జెండాకి అవమానం.. రౌడీ షీటర్ మృతదేహానికి జాతీయ జండా చుట్టి పాతబస్తీ వాసులు నివాళులు

పేరు మోసిన రౌడీ షీటర్ షేక్​ సయీద్​ బావజీర్ వెంట ​భవానీనగర్ కు చెందిన రౌడీషీటర్​ అహ్మద్​ బిన్​ హజబ్ తిరిగేవాడు. అహ్మద్​ బిన్​ హజబ్​ సోదరి వివాహానికి కూడా షేక్​ సయీద్​ బావజీర్​ ఆర్థిక సహాయం చేశాడు. షేక్​ సయీద్​ బావజీర్ కు అహ్మద్​ బిన్​ హజబ్​కు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎక్కడ వెళ్లిన ఇద్దరు కలిసే తిరిగేవారు. ఉన్నట్టుండి గురువారం అర్థ రాత్రి తన కార్యాలయం వద్ద ఉన్న షేక్​ సయీద్​ బావజీర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు

Hyderabad: జాతీయ జెండాకి అవమానం.. రౌడీ షీటర్ మృతదేహానికి జాతీయ జండా చుట్టి పాతబస్తీ వాసులు నివాళులు
Hyderabad News
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 12, 2023 | 1:05 PM

Share

హైదరాబాద్ లోని పాతబస్తీ చంద్రాయణగుట్ట బార్కాస్​కు చెందిన పేరు మోసిన రౌడీ షీటర్ షేక్​ సయీద్​ బావజీర్​ మజ్లీస్ పార్టీ లో కొంతకాలం క్రితం వరకు కార్యకర్తగా చురుకుగా పనిచేసేవాడు. బండ్లగూడ సమీపంలోని ఓ భవనంలో ఒక రూమ్ ను అద్దెకు తీసుకుని ఓ యూ ట్యూబ్​ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నాడు. జల్​పల్లి మున్సిపాలిటీకి చెందిన పలు సమస్యలపై సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతూ ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నాడు. పలు పార్టీల ప్రముఖ నేతలను ఉద్దేశించి విమర్షలు చేసేవాడు. ఈ నేపధ్యంలోనే తనకు ప్రాణ హాని ఉందంటూ పలు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అయితే చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు.

పేరు మోసిన రౌడీ షీటర్ షేక్​ సయీద్​ బావజీర్ వెంట ​భవానీనగర్ కు చెందిన రౌడీషీటర్​ అహ్మద్​ బిన్​ హజబ్ తిరిగేవాడు. అహ్మద్​ బిన్​ హజబ్​ సోదరి వివాహానికి కూడా షేక్​ సయీద్​ బావజీర్​ ఆర్థిక సహాయం చేశాడు. షేక్​ సయీద్​ బావజీర్ కు అహ్మద్​ బిన్​ హజబ్​కు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎక్కడ వెళ్లిన ఇద్దరు కలిసే తిరిగేవారు. ఉన్నట్టుండి గురువారం అర్థ రాత్రి తన కార్యాలయం వద్ద ఉన్న షేక్​ సయీద్​ బావజీర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. బావజీర్​ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దర్యాప్తులో సంచలన విషయాలు

చాలా కాలం నుంచి స్వలింగ సంపర్కం మోజులో పడ్డ రౌడీ షీటర్ బావజీర్​ తన వద్దకు యువకులు తీసుకురావాలని అహ్మద్​ బిన్​ హజబ్ ను పదేపదే ఒత్తిడి చేసేవాడు. తీవ్ర ఒత్తిడి.. అతని బెదిరింపులు భరించలేక కొంతమంది యువకులను హోమో సెక్స్​ కోసం హజబ్​ బావజీర్​కు దగ్గర పంపించినట్లు సమాచారం. గురువారం రాత్రి కూడా మరో మారు బావజీర్​ యువకులను తన వద్దకు పంపాలని బెదిరించాడు. దానికి ఒప్పుకోక పోవడంతో నువ్వే రావాలని రౌడీ షీటర్ బావజీర్​ హజబ్​పై తీవ్ర ఒత్తిడి చేశాడు. దీంతో తనకు అతనితో ప్రాణ హాని ఉందని భావించిన హజబ్​ అదే కత్తితో బావజీర్​పై తీవ్రంగా దాడిచేసినట్లు తెలిసింది. పాత బస్తి సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పాత బస్తి వాసులు రౌడీ షీటర్ మృతదేహానికి  జాతీయ జండా చుట్టి నివాళులు అర్పించారు. దీంతో జాతీయ జెండాకు అవమానం జరిగిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు