Telangana: కరీంనగర్‌లో ఎలుగుబంటి కలకలం.. రంగంలోకి దిగిన అధికారులు. చివరికి ఏమైందంటే.
కరీంనగర్ పట్టణంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో ఎలుగుబంటికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రేకుర్తి ప్రాంతంలో ఎలుగు బంటీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అధికారులు వెంబడిస్తున్న కొద్దీ పరిగెత్తిన ఎలుగుబంటి అందరినీ హడలెత్తించింది. అయితే చివరికి చాకచక్యంగా మత్తు ఇంజక్షన్ ఇచ్చిన అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని రెస్క్యూ వాహనంలో తరలించారు. దీంతో ప్రజలంగా ఊపిరి పీల్చుకున్నారు...
వైరల్ వీడియోలు
Latest Videos