AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యా పిల్లలను చూడ్డానికి వెళ్తే.. పెట్రోల్‌ పోసి తగలబెట్టిన అత్తామామ!

భర్తపై అలిగి పుట్టింటికి వచ్చిన కూతురికి సర్ది చెప్పి కాపురానికి పంపవల్సిందిపోయి.. ఆ తల్లిదండ్రులు దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా ఇంటికి వచ్చిన అల్లుడిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. దీంతో ఒళ్లంతా మంటలు రేగడంతో అల్లుడు సమీపంలోని నీటి తొట్టిలో పడిపోయాడు. ఇరుగు పొరుగు గమనించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ దారుణ ఘటన..

భార్యా పిల్లలను చూడ్డానికి వెళ్తే.. పెట్రోల్‌ పోసి తగలబెట్టిన అత్తామామ!
Son In Law Murder Case
Srilakshmi C
|

Updated on: Feb 17, 2025 | 11:46 AM

Share

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 17: కుటుంబ కలహాలు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. దంపతుల మధ్య కలహాలు రావడంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. తర్వాత భర్త.. అత్తగారింటికి వెళ్లి భార్య పిల్లలను చూద్దామనుకుంటే.. అత్తింటి వారు అతడిని అడ్డుకున్నారు. అంతేనా.. ఇంటి అల్లుడన్న విషయం మరచి అతడిపై అత్తామామ, బామ్మర్దులు ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించి, ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఒళ్లంతా మంటలు రేగడంతో అల్లుడు సమీపంలోని నీటి తొట్టిలో పడిపోయాడు. ఇరుగు పొరుగు గమనించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు వెంకటేశ్వర్లు, అనురాధ దంపతుల కుమార్తె కావ్య. ఆమెను మూడేండ్ల క్రితం పాల్వంచ మండలం దంతలబోరు గ్రామానికి చెందిన బల్లెం గౌతమ్ (24) ప్రేమ వివాహం చేసుకున్నాడు. గౌతమ్ ఎలక్ట్రిషన్‌ పనిచేస్తూ సుజాతనగర్‌లో నివాసం కాపురం పెట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. అయితే 5 నెలల క్రితం భార్యాభర్తలు గొడవ పడటంతో కావ్య అలాగి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న రాత్రి భార్యా పిల్లలను చూసేందుకు గౌతమ్‌ అత్తింటికి వెళ్లాడు.

అయితే అల్లుడు గౌతమ్‌ను అత్త మామ, బామ్మర్దులు ఇంట్లోనికి అనుమతించలేదు. దీంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారు గౌతమ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్నారు. మంటలకు తాళలేక గౌతమ్‌ కేకలు వేస్తూ పక్కనే ఉన్న నీటితొట్టిలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని అతడిని ఇరుగు పొరుగు ఖమ్మం హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ గౌతమ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి బల్లెం వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..