AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆమాత్రానికే ఇంత పగబట్టాలా? నడిరోడ్డుపై తల్వార్‌‌తో అక్కను చంపిన తమ్ముడు..

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గాజ్యా నాయక్ తండాలో దారుణం చోటుచేసుకుంది. ఏకంగా సొంత అక్కపై కక్షతో సొంత తమ్ముడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.పోలీసులు, స్థానికులు,మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గజ్యా నాయక్ తండాకు చెందిన షేక్ రుక్సానా (40) ఈరోజు సుమారు రాత్రి 9:30 గంట ప్రాంతంలో మాచారెడ్డి ఎక్స్ రోడ్డుపై బస్సు దిగి గజ్యా నాయక్ తండాకు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి సొంత తమ్ముడు యూసుఫ్ వెంబడించి చేతిలో రెండు కత్తులను పట్టుకొని..

Telangana: ఆమాత్రానికే ఇంత పగబట్టాలా? నడిరోడ్డుపై తల్వార్‌‌తో అక్కను చంపిన తమ్ముడు..
Ruksana (file Photo)
Prabhakar M
| Edited By: |

Updated on: Sep 13, 2023 | 9:14 AM

Share

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గాజ్యా నాయక్ తండాలో దారుణం చోటుచేసుకుంది. ఏకంగా సొంత అక్కపై కక్షతో సొంత తమ్ముడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.పోలీసులు, స్థానికులు,మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గజ్యా నాయక్ తండాకు చెందిన షేక్ రుక్సానా (40) ఈరోజు సుమారు రాత్రి 9:30 గంట ప్రాంతంలో మాచారెడ్డి ఎక్స్ రోడ్డుపై బస్సు దిగి గజ్యా నాయక్ తండాకు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి సొంత తమ్ముడు యూసుఫ్ వెంబడించి చేతిలో రెండు కత్తులను పట్టుకొని అక్క తలపై దాడి చేసి నరికి చంపి వేశాడు.రక్తపు మడులలో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.

గత కొద్ది రోజుల క్రితం తమ్ముడు ఓ ఆటో కొనుగోలు విషయంలో అక్క తమ్మునికి మధ్య గొడవ జరగడంతో స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో తమ్మునిపై అక్క ఫిర్యాదు చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష గట్టి అక్కపై హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్, కామారెడ్డి రూరల్ సిఐ శ్రీనివాస్ గౌడ్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. రుక్సానా మృతితో గ్రామంలో, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్