Heavy Rain Alert: మరో 2 గంటల్లో కుండపోత వాన.. రెడ్ అలర్ట్ జారీ! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
ఆకాశానికి చిళ్లు పడిందా? అన్నట్లు కుండపోత వర్షాలు జనాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా నీళ్లలో పూర్తిగా మునిగిపోయింది అనడం సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడ కనీవినని రీతిలో రికార్డు స్థాయిలో వాన కురిసింది. ఇక కాసేపట్లో రెండు జిల్లాల్లో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది..

హైదారాబాద్, ఆగస్ట్ 29: రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆకాశానికి చిళ్లు పడిందా? అన్నట్లు కుండపోత వర్షాలు జనాలను అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా నీళ్లలో పూర్తిగా మునిగిపోయింది అనడం సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడ కనీవినని రీతిలో రికార్డు స్థాయిలో వాన కురిసింది. ఇక శుక్రవారం (ఆగస్ట్ 29) కూడా ఆ జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరో రెండు, మూడు గంటల్లో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రెండు జిల్లాల్లో గంటకు 62 నుంచి 87 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. దీంతో ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అనంతరం వచ్చే రెండు మూడు గంటల్లో హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనున్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్‌బాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




