
నగరంలో విపరీతంగా భవనాల నిర్మాణాలు పెరుగుతున్నాయి. అయితే భవన నిర్మాణాలకు తీసుకునేటువంటి అనుమతి ఒకటైతే నిర్మించేటటువంటి అక్రమ నిర్మాణాలు మరొకటి..ఇక అనుమతితో పని లేకుండా ఆపై ఒకటి లేదా రెండు అంతస్తులను అదనంగా నిర్మిస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి. అలా కొందరు యజమానులు అయితే మాత్రం తీసుకున్న పర్మిషన్ ఒకటైతే దానికి అదనంగా నిర్మిస్తేనే ఆ యజమానులు సంతృప్తిగా ఉంటారు. ఉన్న స్థలాన్ని సరిపెట్టుకోకుండా రోడ్లను.. చెరువులను.. ఆక్రమిస్తే తప్ప కొందరికి అయితే నిద్ర పట్టదు. ఇక మొక్కుబడిగా నిర్మాణ అనుమతిని తీసుకొని కనీసం వెలుతురు కూడా దూరలేని విధంగా భవనాలు నిర్మాణం చేస్తున్నారు అధికారులు. ఎక్కడ అధికారులు పసిగడతారో అని రెండు రోజులకే స్లాబ్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
నగరంలో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రమాదాలను దాదాపు ఈ విధంగానే జరిగినవే. కెపిహెచ్‌బీ కాలనీలో అదనపు అంతస్తు కూడా కూలి ముగ్గురు కూలీలు మృత్యువాత పడిన ఘటన తెలిసిందే. ఇటీవల ఈ మధ్యకాలంలో పాతబస్తీలోని ఓ ప్రదేశంలో జీ ప్లస్ త్రీకి పర్మిషన్ తీసుకున్నటువంటి యజమాని జీ ప్లస్ ఫోర్ ను నిర్మించాడు. అనంతరం కింద ఉన్నటువంటి సెల్లార్ గొంతను తీసేటటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ బిల్డింగ్ ఒరిగిపోయింది. అదృష్టవశాత్తు ఆ బిల్డింగ్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయ నష్టమే తప్పింది. అంతేకాకుండా 2016లో నానక్ రామ్ గుడాలో నిర్మాణంలోని ఆరు అంతస్తుల భవనం కూలింది 11 మంది చనిపోయారు. అయితే అనుమతి లేకుండా నిర్మిస్తుండడంతో జిహెచ్ఎంసి అధికారులు యజమానిని లంచం డిమాండ్ చేయగా అతని వేగంగా పనులు పూర్తి చేయాలని హడావిడిగా స్లాబుల్ నిర్మించాడు. దీంతో బరువు తట్టుకోలేక పిల్లర్లు ఒరిగిపోయి భవనం కూలిందని విచారణలో తేలింది ఆ తర్వాత పలు సెల్లార్ల తవ్వకాల్లో ఫిలింనగర్ సాంస్కృతిక కేంద్రం పోర్టికో నిర్మాణంలో ఇలా పదుల సంఖ్యలో ఎక్కడో ఒక దగ్గర ఈ విధంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
నిర్మాణ అనుమతులలో సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్బీ పాస్ చట్టాన్ని తీసుకొచ్చింది. సులువుగా అనుమతులు ఇస్తే అనుమతి లేని నిర్మాణాలు ఉండవని సర్కార్ భావించింది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి .ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ దళారులు అవినీతి అధికారులు వసూళ్ల నుంచి దరఖాస్తుదారులకు విముక్తి లభించలేదు. జీహెచ్ఎంసీ భూసేకరణ చేపట్టిన స్థలాలకు నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తున్నారు. అనుమతి లేని అదనపు అంతస్తులకు 10 లక్షల మేర వసూలు చేస్తున్నారు. ఈ విధంగా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధంగానే వసూళ్ల పర్వం కొనసాగడంతో పాటు అమాయకుల బలవుతున్నారు.