Hyderabad: బరువేమో కానీ.. ప్రాణాలు తీసేలా ఉన్నారు.. లావు తగ్గించండని వెయిట్ లాస్ సెంటర్‌కు వెళ్తే..
లావు తగ్గించండని వెళ్తే.. చావు అంచులు చూపించారు..! స్లిమ్‌గా కనిపిస్తారని చెప్పి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు..! బరువు తగ్గడం మాటేమో కానీ.. బతికుంటే చాలంటూ చివరికి బాధితురాలు ఆస్పత్రి పాలైన పరిస్థితి. సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన మహేశ్వరి బరువు తగ్గడం కోసం స్థానికంగా ఉన్న కలర్స్‌కు వెళ్లారు.

లావు తగ్గించండని వెళ్తే.. చావు అంచులు చూపించారు..! స్లిమ్‌గా కనిపిస్తారని చెప్పి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు..! బరువు తగ్గడం మాటేమో కానీ.. బతికుంటే చాలంటూ చివరికి బాధితురాలు ఆస్పత్రి పాలైన పరిస్థితి. సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన మహేశ్వరి బరువు తగ్గడం కోసం స్థానికంగా ఉన్న కలర్స్‌కు వెళ్లారు. 15 కేజీలు బరువు తగ్గడానికి 40 వేలు ఫీజు అన్నారు.. OK అనుకుని ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాక.. ఆ చికిత్సా విధానంతో బెంబేలెత్తిపోయారు. వెయిట్‌లాస్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా మొదటి రోజు మసాజ్ చేసిన సిబ్బంది.. రెండో రోజు ఎలక్ట్రిక్ వైబ్రెట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడి నుంచి మొదలయ్యాయి కష్టాలు. షాక్ కొట్టడంతో మహేశ్వరికి వాంతులు మొదలయ్యాయి. కళ్లు తిరిగాయి. దీంతో హడావుడిగా ట్రీట్‌మెంట్ ముగించేశారు. మూడో రోజుకు అంతా సెట్ అవుతుందనుకుంటే.. మళ్లీ షాక్ ట్రీట్‌మెంట్ దెబ్బకు బెంబేలెత్తిపోయింది మహేశ్వరి.
3వ రోజు ట్రీట్‌మెంట్ టైమ్‌లో తీవ్రమైన కడుపునొప్పితో వాష్‌రూమ్‌లో కళ్లుతిరిగి పడిపోయింది మహేశ్వరి. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా.. కలర్స్ సిబ్బంది పట్టించుకోలేదనేది ఆమె ఆరోపణ. హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరి ప్రస్తుతం అక్కడ కోలుకుంటున్నారు.
కలర్స్ యజమాన్యం బరువు తగ్గిస్తామంటూ చెప్పి ఇష్టరాజ్యంగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తోందంటూ కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి భర్త. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
