KTR Video: రెస్టారెంట్లో మినిస్టర్ కేటీఆర్.. చూసేందుకు ఎగబడ్డ జనం

పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర ఓ రెస్టారెంట్‌లో మంత్రి కేటీఆర్‌ కనిపించడంతో.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండానే.. వితౌట్‌ ప్రోటోకాల్‌ ఆయన రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకు ఆయనను పెద్దగా ఎవరూ గుర్తుపట్టలేదు. కాని ఆర్డర్‌ ఇచ్చే సమయంలో మంత్రిని చూసిన అక్కడివారు ఆశ్చర్యపోయారు. కేటీఆర్‌ వస్తున్నారంటూ కాన్వాయ్‌తోపాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది.

KTR Video: రెస్టారెంట్లో మినిస్టర్ కేటీఆర్.. చూసేందుకు ఎగబడ్డ జనం
Telangana Minister Ktr Visits A Restaurant Without Any Protocol In Old City, Hyderabad

Edited By:

Updated on: Nov 18, 2023 | 8:22 AM

పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర ఓ రెస్టారెంట్‌లో మంత్రి కేటీఆర్‌ కనిపించడంతో.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండానే.. వితౌట్‌ ప్రోటోకాల్‌ ఆయన రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకు ఆయనను పెద్దగా ఎవరూ గుర్తుపట్టలేదు. కాని ఆర్డర్‌ ఇచ్చే సమయంలో మంత్రిని చూసిన అక్కడివారు ఆశ్చర్యపోయారు. కేటీఆర్‌ వస్తున్నారంటూ కాన్వాయ్‌తోపాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది. కాని.. ఇలా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్‌ ఇవ్వడం చూసి షాక్‌ అయ్యారు. ఆయన బిర్యానీతో పాటు.. పలురకాల దేశవిదేశీ వంటకాలను రుచి చూశారు. మంత్రి వచ్చారని తెలుసుకుని ఆయనకు స్పెషల్‌ డిషెస్‌ను వడ్డించారు రెస్టారెంట్‌ యాజమాన్యం. ఆయన ఇటు డిన్నర్‌ చేస్తూనే.. అక్కడకు వచ్చిన కస్టమర్లను పలకరించారు. మంచిచెడులు అడిగి తెలుసుకున్నారు. అటు హోటల్‌కు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. మంత్రితో సెల్ఫీలకోసం ఎగబడ్డారు జనం.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..