AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lagacharla Incident: లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..

లగచర్ల లడాయిపై.. ఓవైపు కేసుల టెన్షన్‌.. మరోవైపు పొలిటికల్‌ అటెన్షన్‌ ఎక్కువైంది.అసలు దాడి చేసింది గ్రామస్తులేనా..? ఎంక్వయిరీలో ఏం తేలింది..? సీఎం రియాక్షన్ తర్వాత.. అధికారుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి..? అనేది హాట్ టాపిక్ గా మారింది.. ఈ తరుణంలోనే పోలీసులు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది..

Lagacharla Incident: లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..
Lagacharla Incident
Shaik Madar Saheb
|

Updated on: Nov 13, 2024 | 9:52 AM

Share

వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడి ఘటనపై రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌ యాక్షన్‌కు దిగుతోంది. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ సహా అధికారులపై దాడికి ప్లాన్‌ చేసిందెవరు..? అధికార బృందాన్ని తప్పుదారి పట్టించిందెవరు..? ఇప్పుడీ ప్రశ్నల చుట్టే పోలీస్‌ ఎంక్వైరీ సాగుతోంది. అయితే కలెక్టర్‌పై దాడి కచ్చితంగా కుట్రేనంటోంది పోలీసుయంత్రాంగం. అంతా ప్రీప్లాన్డ్‌గానే జరిగిందని తేల్చారు హైదరాబాద్‌ రేంజ్ ఐజీ సత్యనారాయణ.. ఈ తరుణంలో పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. తాజాగా.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు.. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.. నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వికారాబాద్ తరలిస్తున్నారు.. దాడి కేసులో సూత్రదారిగా ఉన్న భోగమోని సురేష్‌తో పట్నం నరేందర్ రెడ్డి పలు మార్లు మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటా సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు..

వీడియో చూడండి..

ఈకేసులో మరిన్ని అరెస్ట్‌లు ఉంటాయంటున్న పోలీసులు.. కీలక సూత్రధారి భోగమోని సురేష్‌ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇప్పటికే 16 మందిని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పోలీస్ బందోబస్తు నడుమ పరిగి సబ్ జైలుకు తరలించారు. ఇప్పటివరకు 55 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. వారిలో 39 మందిని నోటీసులు ఇచ్చి పరిగి పోలీస్ స్టేషన్ నుంచి పంపించివేశారు.

కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసి… ముందు జాగ్రత్తగా ఆయా గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. ఇది కుట్రపూరితంగానే జరిగిన ఘటన అని చెబుతున్న పోలీసులు.. దాడి ఘటనలో పాల్గొన్న వారిని మరి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం..

పోలీసుల బందోబస్తు, అరెస్టులతో కొడంగల్ లోని పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి..

లైవ్ వీడియో

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..