Kishan Reddy: “తెలంగాణ పాలిట సీఎం కేసీఆర్ శాపంగా మారారు”.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామయాత్ర మూడో విడత ప్రారంభమైంది...

Kishan Reddy: తెలంగాణ పాలిట సీఎం కేసీఆర్ శాపంగా మారారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy On Cm Kcr
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 02, 2022 | 1:38 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామయాత్ర మూడో విడత ప్రారంభమైంది. యాదాద్రి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడుతున్న టీఆర్ఎస్ కు.. ఈడీ గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్న కిషన్ రెడ్డి.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు మాత్రం టైం ఉంటుందని ఎద్దేవా చేశారు. కేజీ టూ పీజీ విద్య ఏమైందని నిలదీశారు. ఏడాది తర్వాత మార్పు ఖాయమని అధికారులు ఓవర్ యాక్షన్ చేయవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

24 రోజుల పాటు కొనసాగనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దర్శనంతో ముగియనుంది. యాదగిరిపల్లి, గాంధీనగర్, గణేశ్ నగర్‌, శుభం గార్డెన్‌, పాతగుట్ట, యాదగిరిగుట్ట ప్రధాన రహదారి, గొల్లగుడిసెలు, దాతారుపల్లి, బస్వాపూర్‌ గ్రామాల్లో పర్యటన సాగనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 15 సీట్లే గెలుస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయకత్వం నిర్ణయం ప్రకారం తాను పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాకు పూర్తి నమ్మకం ఉందని, కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!