NTR Daughter Uma mahehswari : హత్యా..? ఆత్మహత్యా..? మరణం ఆవల మహాప్రశ్న..!

NTR Daughter Uma mahehswari : హత్యా..? ఆత్మహత్యా..? మరణం ఆవల మహాప్రశ్న..!

Anil kumar poka

|

Updated on: Aug 02, 2022 | 5:10 PM

ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగింది..నందమూరి తారకరామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి సూసైడ్ చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఆనారోగ్య, మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు...


ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగింది..నందమూరి తారకరామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి సూసైడ్ చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఆనారోగ్య, మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు… వాటి ఫలితంగానే సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు.ఈ ఉదయం 10గంటల సమయంలో ఉమామహేశ్వరి ఇంటికి వచ్చారు చిన్నకూతురు దీక్షిత, ఆమె భర్త..వాళ్లతో మాట్లాడి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన ఉమామహేశ్వరి మధ్యాహాన్నం 2గంటలైనా బయటకు రాకపోవడంతో తలుపుతట్టి లేపే ప్రయత్నం చేశారు ఫ్యామిలీ మెంబర్స్‌..ఎంతకీ తీయకపోవడంతో బలవంతంగా తెరిచిన కుటుంబీకులకు చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు ఉమామహేశ్వరి.అయితే మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కూతురు దీక్షితానే పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పారు..2.45 సమయంలో పోలీసులు జూబ్లీహిల్స్‌లోని ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు..ఉస్మానియాలో పోస్టుమార్టం చేపించారు. అయితే ఈమెది ఆత్మహత్యా.. హత్యా అనే ఉత్కంఠ అటు ఇండస్ట్రీ పీపుల్స్‌ తో పాటు.. సోషల్ మీడియాలోనూ.. ఉంది. దీనికితోడు ఎప్పుడూ ప్రశాంతగా ఉండే ఉమామహేశ్వరికి మానసిక సమ్యసలు ఉండే చాన్స్ లేదంటున్నారు ఆమె సన్నిహితులు. ఉన్నపళంగా ఇలా ఆత్మహత్య చేకోవడం అందర్నీ షాక్ కు గురిచేసిందని… నిజాలు నిగ్గుతేలాల్సిన అవసరం ఉందంటూ.. మీడియా ముందు వాపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 02, 2022 05:10 PM