Hyderabad Liberation Day: విమోచన ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబు.. ఇవాళ రాత్రి హైదరాబాద్ చేరుకోనున్న అమిత్‌షా
ఊరూవాడా ఉత్సవాలకు ముస్తాబైంది. కేంద్రమే ఈ ఉత్సవాలను నిర్వహించడం ఒక విశేషం కాగా.. పరేడ్ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుంది. పరేడ్ గ్రౌండ్‌లో..
సంబరాలకు వేళయ్యింది. విమోచన దినోత్సవానికి హైదరాబాద్ రెడీ అయ్యింది. ఊరూవాడా ఉత్సవాలకు ముస్తాబైంది. కేంద్రమే ఈ ఉత్సవాలను నిర్వహించడం ఒక విశేషం కాగా.. పరేడ్ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుంది. పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ చరిత్ర ఉట్టి పడేలా.. ఫోటో అండ్ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించారు గవర్నర్ తమిళిసై. దీంతో ఈ వేడుకలు ముందే ప్రారంభమయ్యాయి. ఎగ్జిబిషన్‌లో భాగంగా ఒక థియేటర్ ఏర్పాటు చేశారు. తెలంగాణ విమోచన ఉద్యమం ఎలా సాగింది..? ఆపరేషన్ పోలో ఎలా నిర్వహించారు..? ఆనాటి నిజాం రజాకార్ల అకృత్యాలు ఎలా ఉండేవో.. కళ్లకు కట్టినట్టు చూపించే ఏర్పాట్లు జరిగాయి. పరేడ్ గ్రౌండ్ కార్యక్రమాలను కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
కర్నాటక, మహారాష్ట్ర నుంచి బీజేపీ నేతలు వస్తున్నారు. వీరితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అందులో భాగంగా.. అమిత్ షా ఈ రోజు రాత్రి.. హైదరాబాద్ వస్తున్నారు. ఆ మర్నాటి ఉదయం 8 గంటల 45 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. 11 గంటల వరకూ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..