Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. ఆ విషయంలో రేవంత్‌ను నిలదీసిన సీనియర్లు..!

Telangana Congress: తాము అధికారంలోకి వస్తే.. కోడ్ నుంచి ఫ్లాగ్ వరకూ అన్నీ మారిపోతాయ్. ఒక్క చాన్స్ ఇస్తే.. అసలు సిసలు తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తాం.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. ఆ విషయంలో రేవంత్‌ను నిలదీసిన సీనియర్లు..!
Congress
Follow us
Shiva Prajapati

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 16, 2022 | 6:28 AM

Telangana Congress: తాము అధికారంలోకి వస్తే.. కోడ్ నుంచి ఫ్లాగ్ వరకూ అన్నీ మారిపోతాయ్. ఒక్క చాన్స్ ఇస్తే.. అసలు సిసలు తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తాం. ఇదీ టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ అంటోన్న మాట. ఈ అంశంపై భగ్గుమంటున్నారు సీనియర్లు. మాకు తెలీకుండా మీ ఇష్టమొచ్చినట్టు విగ్రహాలు జెండాలు మార్చేస్తారా? అంటూ గయ్యిమంటున్నారు. కాంగ్రెస్‌లో చెలరేగుతున్న ఈ కొత్త లొల్లి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

‘టీకాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. TSగా ఉన్న తెలంగాణ కోడ్‌ను TGగా మారుస్తాం. అధికారిక గేయంగా అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణను ప్రకటిస్తాను. కొత్త రూపంతో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తాం. తెలంగాణ కోసం ప్రత్యేకగా ఓ జెండా రూపకల్పన చేస్తాం.’ అంటూ.. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే మార్పు చేర్పులను ప్రకటిస్తూ.. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటు రాజేసే యత్నం చేస్తున్నారు టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఎస్ కోడ్- టీఆర్ఎస్ పార్టీని సూచించిందే అని అంటున్నారు రేవంత్.

ఇక అందెశ్రీ పాట కూడా గతంలో ఒక చర్చనీయాంశం. ఈ పాట విషయంలో అప్పట్లో భిన్నస్వరాలు వినిపించాయి. పాటను రాష్ట్ర గీతంగా ఎంపిక చేయక పోవడంపై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరందరినీ తన వైపునకు తిప్పుకునే ఎత్తుగడ వేశారు రేవంత్. ఇక తెలంగాణ తల్లికి కూడా గులాబీ రంగులు అద్దేశారనీ. ఈ విగ్రహం అసలు యావత్ తెలంగాణ జాతికి ప్రతిబింబం కాదనీ. కేవలం టీఆర్ఎస్ ప్రతిరూపమనీ.. జనాన్ని రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. ఇక చివరిగా జెండా మీద రేవంత్ చేసిన కామెంట్లు కూడా ఒక సంచలనమే. కారణం ఇప్పటి వరకూ ఏ రాష్ట్రానికీ ఒక జెండా అంటూ లేదు. పార్టీలకుంటాయి కానీ స్టేట్ కి జెండా ఉండదు. ఈ విషయాలన్నిటిపై టీకాంగ్రెస్ లో తర్జన భర్జన జరిగిందట. దీనిపై సీనియర్లంతా కలిసి రేవంత్ ను నిలదీశారట.

ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారడ్డి ఇంట్లో ముఖ్య నాయకుల భేటీ జరిగింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అయితే, ఈ భేటీలో వాడివేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్ల సమ్మతి లేకుండా రేవంత్ ఇలాంటి పాయింట్లు తెరపైకి ఎలా తెస్తారని ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం.

ఈ సెప్టెంబర్ 17 నుంచి వచ్చే సెప్టెంబర్ 17 వరకూ ఈ మార్పు- చేర్పులు చేయాలన్నది రేవంత్ స్కెచ్. అయితే ఈ మార్పులపై సీనియర్ల నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్న వేళ.. రేవంత్ ఈ అంశంపై పదిహేడున ఏవైనా ప్రకటనలు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్17 వివాదంపై చర్చించడానికి వచ్చిన టీ- కాంగ్రెస్ లీడర్లంతా.. రేవంత్ ను కొత్త మార్పులపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారట. దీంతో ఈ కొత్త వ్యవహారం సందిగ్ధంలో పడిందా? అన్న మాట వినిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..