Apple Side Effects: రోజూ ఒక యాపిల్ తింటున్నారా? ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఇలా చేశారో అంతే సంగతులు..

Apple Side Effects: రోజూ ఒక యాపిల్ తింటే వైద్యుడి అవసరమే లేదని అంటుంటారు. ఇది నిజమే. అయితే, యాపిల్ సైతం ఆరోగ్యంపై దుష్ప్రభావం..

Apple Side Effects: రోజూ ఒక యాపిల్ తింటున్నారా? ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఇలా చేశారో అంతే సంగతులు..
Apple
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 16, 2022 | 8:10 AM

Apple Side Effects: రోజూ ఒక యాపిల్ తింటే వైద్యుడి అవసరమే లేదని అంటుంటారు. ఇది నిజమే. అయితే, యాపిల్ సైతం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. యాపిల్.. ప్రేగులు, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో అద్భుతమైన పోషకాలు, డైటరీ ఫైబర్ ఉంది. యాపిల్స్‌లో విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అయితే, ఎక్కువ యాపిల్స్ తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ఎక్కువగా తినడం వలన జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం రోజుకు రెండు యాపిల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతకు మించి తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు.

ఆపిల్ ఎలా ఇబ్బంది కలిగిస్తుంది? యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది. ఇది అద్భుతమైన ప్రీ-వర్కౌట్ స్నాక్‌గా పని చేస్తుంది. అయినప్పటికీ.. దీనిని అధికంగా తీసుకోవడం వలన కొన్ని సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

జీర్ణ సమస్యలు : యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవి ఎక్కువగా ఉంటే ఉబ్బరం, మలబద్ధకం కలిగిస్తాయి. సగటున, ఒక వ్యక్తికి రోజుకు గరిష్టంగా 70 గ్రాముల ఫైబర్ అవసరం. కానీ, అంతకు మించి ఫైబర్ శరీరంలో ఉంటే.. ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు : కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే యాపిల్స్ సెరోటోనిన్ కారణంగా శక్తిని పెంచుతాయి. అయితే, ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.

పురుగుమందుల అధిక వినియోగం: ప్రస్తుత కాలంలో యాపిల్స్‌ ఎక్కువశాతం పెస్టిసైడ్స్ ఆధారంగానే పండిస్తున్నారు. పైగా ఈ యాపిల్‌ చూడటానికి ఫ్రెష్‌గా ఉండేందుకోసం ఒక రకమైన రసాయనాన్ని అప్లై చేస్తున్నారు. ఇది క్యాన్సర్‌కు కారణం అవుతుంది.

అధిక బరువు: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువ యాపిల్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు. యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

దంతాల సమస్య: యాపిల్స్‌లో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. సోడాలు తాగడం కంటే యాపిల్స్ ఎక్కువగా తినడం వల్ల దంత సమస్యలు ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!