Memory Booster: మీ పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతోందా.. అయితే ఈ చిట్కాలతో సూపర్ బ్రెయిన్‌గా మార్చేయోచ్చు.. మీరు చేయాల్సిందల్లా..
Ayurvedic Tips: వృద్ధాప్యంతో జ్ఞాపకశక్తి క్రమంగా బలహీనపడటం ప్రారంభిస్తుంది. అయితే ఇది ఇప్పుడు కొంతమంది పిల్లలలో కనిపిస్తుంది. మీ పిల్లలతో మీకు అదే సమస్య ఉంటే.. ఈ పద్ధతులను ప్రయత్నించండి.
Foods to Boost Memory: వృద్ధాప్యంతో వారి జ్ఞాపకశక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. నేటి పిల్లల్లో కూడా ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోవడం మొదలుపెడుతున్నారు. వాళ్ళకి స్కూల్లో ఇచ్చిన పని గుర్తుండదు.. ఇలాంటి సమస్య యువతలో కూడా ఉంది.. అంటే ఏ వయసు వారైనా ఇలాంటి సమస్యను ఎదుర్కోని వారు ఉండరు కానీ.. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా.. ఇవాళ మనం దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం..
జ్ఞాపకశక్తి ఎందుకు తగ్గుతోంది..?
శరీరంలో పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణంగా చెప్పవవచ్చు. కొన్నిసార్లు తలకు గాయం కావడం వల్ల చాలా విషయాలను గుర్తుంచుకోవడంలో కూడా సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని భయంకరమైన వ్యాధి కారణంగా ఇలా జరుతుండవచ్చు..అయితే ఇలాంటి సమస్యను మనం అదేపనిగా మనసులో పెట్టుకోవపోవడం సరికాదు. అయితే జ్ఞాపకశక్తి తగ్గుతున్నదని తెలిసిన తర్వాత వెంటనే దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. తగ్గిపోతున్న జ్ఞాపకశక్తికి పెంచుకునేందుకు కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీరు మెమరీ లాస్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఇవే మార్గాలు..
బ్రాహ్మీ పాలు మెదడుకు చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలు మీ జ్ఞాపకశక్తికి పదును పెట్టడంలో సహాయపడతాయి. పెద్ద విషయం ఏమిటంటే ఇది ఎటువంటి దుష్ప్రభావాన్ని కలిగించదు.. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అర్థం. మీరు 1 గ్లాసు పాలలో అర టీస్పూన్ బ్రహ్మీని మరిగించి సుమారు 2 నిమిషాలపాటు వేడి చేయండి. ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఈ పాలను త్రాగాలి.
అంతేకాదు క్యారెట్ జ్యూస్‌లో కుంకుమపువ్వు కలుపుకుని తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి జ్ఞాపకశక్తి కోసం.. ఉదయం పూట బహిరంగ ప్రదేశంలో వ్యాయామం చేయడం.. నడవడం, శిర్షాసన, ధనురాసనం వంటి యోగాసనాలను వేడయం వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. మతిమరుపు నుంచి దూరంగా ఉంచే కొన్ని ఆసనాలు కూడా వేయడం మంచిది. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఉండేట్లుగా చూసుకుంటే కూడా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు. దీనితో పాటు వాల్‌నట్‌లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌ను పాలల్లో కలిపి తాగడం వల్ల మతిమరుపు పోతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం