Hyderabad: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. ఒకేరోజు రాత్రి నలుగురు దారుణ హత్య..

|

Jun 21, 2023 | 11:15 AM

Hyderabad News: ప్రశాంతంగా ఉండే హైదరాబాద్‌లో నేరాలు మళ్లీ పెరిగిపోతున్నాయి. వరుసగా దొంగతనాలు, అఘాయిత్యాలు, హత్యలు, కిడ్నాప్‌లతో భాగ్యనగరాన్ని హడలెత్తిస్తున్నారు నేరగాళ్లు.. ఒక హత్య కేసును ఛేదించే లోపు మరొకటి జరుగుతుండడంతో పోలీసులకు సైతం నిద్రపట్టడం లేదు.

Hyderabad: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. ఒకేరోజు రాత్రి నలుగురు దారుణ హత్య..
Crime News
Follow us on

Hyderabad News: ప్రశాంతంగా ఉండే హైదరాబాద్‌లో నేరాలు మళ్లీ పెరిగిపోతున్నాయి. వరుసగా దొంగతనాలు, అఘాయిత్యాలు, హత్యలు, కిడ్నాప్‌లతో భాగ్యనగరాన్ని హడలెత్తిస్తున్నారు నేరగాళ్లు.. ఒక హత్య కేసును ఛేదించే లోపు మరొకటి జరుగుతుండడంతో పోలీసులకు సైతం నిద్రపట్టడం లేదు. పెట్రోలింగ్‌ పెంచినప్పటికీ.. రాత్రిపూట నేరాలు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా.. హైదరాబాద్‌ లో వేర్వేరు చోట్ల నాలుగు హత్యలు జరిగాయి. ఓ ఘటనలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు, మరో ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మరో ఇద్దరిని దుండగులు దారుణంగా చంపారు.

రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారిపై జంట హత్యలు జరగడం కలకలం రేపింది. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ రెండు హత్యలు జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. బ్లాంకెట్లు అమ్ముకునే వ్యక్తిని, రోడ్డు పక్కన షాప్ ముందు నిద్రిస్తున్న మరో వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు గ్రానైట్ రాళ్లతో కొట్టి.. దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్యకు గల కారణాలు ఏంటనే విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. స్థలానికి చేరుకున్న మైలర్‌దేవ్‌పల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు.

టప్పాచబుత్రలో సైతం బుధవారం రాత్రి ఘోరం జరిగింది. దైబాగ్‌ ప్రాంతంలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు హత్యకు గురయ్యారు. మృతులు యూసూఫ్.. ఎలియాస్ డాలి, రియాజ్ ఎలియాస్ సోఫియాగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇద్దరిని కత్తులతో పొడిచి, బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. అయితే, ఒకేరోజు రాత్రి నలుగురి హత్య జరగడం నగరంలో కలకలం రేపింది. వీరిని ఎందుకు హత్య చేశారు.. ప్రత్యర్థులెవరు.. అంతకుముందు ఎలాంటి వివాదాలు ఉన్నాయి.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..