‘బీఆర్ఎస్ కథ ఇంకా ముగిసిపోలేదు.. మళ్లీ సీఎం అవుతా’ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

టీవీ9తో జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పలు సంచలన విషయాలను బయటపెట్టారు. కాళేశ్వరం అంశం నుంచి లిక్కర్ స్కాం దాకా.. అప్పుల విషయం నుంచి విద్యుత్ సరఫరా దాకా అన్నింటికి కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానమిచ్చారు గులాబీ బాస్. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని కేసీఆర్ చెప్పారు.

'బీఆర్ఎస్ కథ ఇంకా ముగిసిపోలేదు.. మళ్లీ సీఎం అవుతా' కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Kcr Live Show
Follow us

|

Updated on: Apr 24, 2024 | 9:03 AM

టీవీ9తో జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పలు సంచలన విషయాలను బయటపెట్టారు. కాళేశ్వరం అంశం నుంచి లిక్కర్ స్కాం దాకా.. అప్పుల విషయం నుంచి విద్యుత్ సరఫరా దాకా అన్నింటికి కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానమిచ్చారు గులాబీ బాస్. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామని కేసీఆర్ చెప్పారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేమి, అసమర్ధతకు నిదర్శనమని మండిపడ్డారాయన. కాళేశ్వరం ద్వారా ప్రజలు ప్రయోజనం పొందారని కేసీఆర్ చెప్పారు. తన మీద కోపంతో కాంగ్రెస్ నేతలు రైతుల పొలాలు ఎండబెట్టారని.. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే సహించేది లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయించకపోతే తానే స్వయంగా చేయిస్తానని కేసీఆర్ చెప్పారు.

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్‌గా మళ్లీ పేరు మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ స్పందించారు. పార్టీ పేరు మార్పు ఇప్పట్లో సాధ్యం కాదని.. ఇంత త్వరగా మళ్లీ పేరును మార్చేందుకు ఎన్నికల సంఘం ఒప్పుకోదని కేసీఆర్ చెప్పారు. ఈసీ నిబంధనల ప్రకారం పేరు మార్చాలంటే కనీసం అయిదారేళ్లు గ్యాప్ ఉండాలని.. తమ పేరు మార్చే ఆలోచన, అవసరం కూడా లేదని స్పష్టం చేశారు కేసీఆర్. తాము అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల ప్రజలను ఆదుకున్నామని ఆయన అన్నారు. అన్ని రకాల స్కీంలు తెచ్చామన్నారు. అయితే కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. వాటిని నమ్మి 2-3 శాతం ప్రజలు అటు వైపు ఓట్లు వేశారన్నారాయన. దాని వల్లే తాము ఓడిపోయామన్న కేసీఆర్.. తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు తమ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అంటున్నారు. 25 మంది ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు. రాష్ట్రాన్ని బాగా నడుపుదామని వారు అంటున్నారని చెప్పారు.

తాను మళ్లీ సీఎం అవుతానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. తమ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేసారు. పార్టీ కథ ముగిసిపోలేదని, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పుకొచ్చారు. అటు లిక్కర్ స్కాంపై కూడా మాట్లాడిన కేసీఆర్.. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది అంతా బోగస్ అని.. అది నరేంద్ర మోదీ సృష్టి అని దుయ్యబట్టారు. లిక్కర్ పాలసీ అనేది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించింది. అన్ని ప్రభుత్వాలకు పాలసీ ఉంటుంది. తన కూతురికి దీనితో ఏ సంబంధం లేదని.. ఆమె కడిగిన ముత్యంలా బయటికి వస్తుందన్నారు కేసీఆర్. ఆమెను విట్నెస్ కింద విచారించారు. ఇప్పుడు అపరాధి అంటున్నారు. ఈ స్కీంలో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదని కేసీఆర్ మండిపడ్డారు.

లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వరా.? అని కేసీఆర్ ప్రశ్నించారు. వారు ఎక్కడికైనా పారిపోతారా.? అని అడిగారు. స్కాం విచారణ అంటూ అనవసరంగా అమాయకులను మోదీ శిక్షిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై గెలిచే శక్తి లేకనే అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి, 700 మంది ప్రజాప్రతినిధులను బీజేపీలోకి లాక్కున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీలో మళ్లీ జగన్ గెలుస్తారు..

ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఏదో ఒక పార్టీకి తాను వత్తాసు పలకడం సరికాదన్నారు. వాళ్ల రాజకీయాలు వాళ్లు చేసుకుంటున్నారని.. తనకు అందిన సమాచారం ప్రకారం జగన్ గెలుస్తారని కేసీఆర్ తెలిపారు. ఎవరు గెలిచినా తమకు సంబంధం లేదని.. ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?