AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Traffic Restrictions: వాహనదారులకు అలెర్ట్‌.. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే

సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలతో పాటు పలు మార్గాల్లో వాహనాలను దారిమళ్లించనున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును పూర్తిగా మూసేస్తారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సచివాలయం, గన్‌పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలున్నాయి.

Hyderabad Traffic Restrictions: వాహనదారులకు అలెర్ట్‌.. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే
Hyderabad Traffic
Basha Shek
|

Updated on: Jun 02, 2023 | 8:06 AM

Share

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్‌ సర్కార్‌ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 3 వారాల పాటు ఉత్సవాలను నిర్వహించాలని ప్రణాళికలు రచించింది. ఇక ఉత్సవాల మొదటి రోజైన శుక్రవారం (జూన్‌ 2) హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఈనేపథ్యంలో సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలతో పాటు పలు మార్గాల్లో వాహనాలను దారిమళ్లించనున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును పూర్తిగా మూసేస్తారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సచివాలయం, గన్‌పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలున్నాయి. ఈ కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు కోరారు. అలాగే అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం పరిసరాల్లో కూడా వాహనాలను కొద్దిసేపు నిలిపివేయనున్నారు. పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్‌ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, అయోధ్య నుంచి నిరంకారి, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్‌ మినార్‌, ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి రవీంద్రభారతి, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌ వైపు, బీజేఆర్‌ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్‌ జంక్షన్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేయనున్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఇలా..

  • వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ వరకు ఇరువైపులా వాహనాలకు అనుమతి లేదు. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి సాదన్‌ కాలేజీ వైపు మళ్లిస్తారు.
  • ఇక వీవీఐపీ రాకపోకల సందర్భంగా షాదాన్‌ కాలేజీ నుంచి సోమాజిగూడ రూట్‌లో ట్రాఫిక్‌ను కొన్ని నిమిషాల పాటు ఆపేయనున్నారు.
  • ఇక్బాల్‌మినార్‌ జంక్షన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి ట్రాఫిక్‌ అనుమతి ఉండదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వద్ద మళ్లిస్తారు.
  • ఇక తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి కట్టమైసమ్మ జం క్షన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు. అఫ్టల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి.
  • ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ మీదుగా ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు పంపిస్తారు.
  • ఇక బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
  • బడాగణేశ్‌ లేన్‌ వైపు నుంచి ఐమాక్స్‌, నెక్లెస్‌ రోటరీ నుంచి మింట్‌ కంపౌండ్‌ వెళ్లే వాహనాలను రాజ్‌దూత్‌ లేన్‌లోకి మళ్లిస్తారు.
  • మింట్‌లేన్‌ నుంచి బడాగణేశ్‌ రూట్‌లో అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు మళ్లిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్