Traffic Restrictions: మారథాన్ 2021 ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..!

|

Dec 19, 2021 | 8:05 AM

మారథాన్-2021తో ఆదివారం నాడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని రూట్లలో ట్రాఫిక్‌ రూల్స్ మార్చారు. ఈ మారథాన్‌లో..

Traffic Restrictions:  మారథాన్ 2021 ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..!
Follow us on

Traffic Restrictions for Hyderabad Marathon: మారథాన్-2021తో ఆదివారం నాడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని రూట్లలో ట్రాఫిక్‌ రూల్స్ మార్చారు. ఈ మారథాన్‌లో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొంటుంన్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్డు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు దాదాపు 42 కి.మీ వరకు ఈ మారథాన్-2021 జరగనుంది. ఇందులో ఫుల్ మారథాన్‌తో పాటు హాఫ్ మారథాన్ నిర్వహించనున్నారు. ఇవి రెండూ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ నుంచి ప్రారంభం కానున్నాయి. 10 కిలోమీటర్ల మారథఆన్ హైటెక్స్ ఎన్‌ఏకసీ మెయిన్ గేట్, మాదాపూర్ నుంచి ప్రారంభం కానుంది.

మారథాన్ 2021 మేరకు జూబ్లీహిల్స్ నుంచి కావూరి హిల్స్ మీదుగా ఇనార్బిట్ మాల్ వైపు వచ్చే వాహనాలను సైబర్ టవర్స్, ఐకియా రోటరీ, ఇనార్బిట్ మాల్, బయో డైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ వైపునకు మార్చారు. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి సైబర్ టవర్స్, ఐకియా అండర్‌పాస్, బయో డైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఒఆర్‌ఆర్‌ వైపునకు మళ్ళించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

కొత్తగూడ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ వైపునుంచి వచ్చే వెహికిల్స్‌ను రోలింగ్ హిల్స్, ఐకియా ఫ్లైఓవర్, ఇనార్బిట్ మాల్, సైబర్ టవర్స్ వైపునకు మళ్లించినట్లు తెలిపారు. మెహదీపట్నం, ఓఆర్‌ఆర్ వైపు నుంచి వచ్చే వెహికిల్స్‌ను గచ్చిబౌలి జంక్షన్, కొండాపూర్, రాడిసన్ జంక్షన్, బొటానికల్ జంక్షన్, మసీదు విలేజ్ వైపునకు మళ్లించారు. అలాగే కొన్ని వాహనాలను లింగంపల్లి వైపునకు కూడా మళ్లించినట్లు తెలిపారు.

గచ్చిబౌలి ఓఆర్‌ఆర్, శంషాబాద్, మెహదీపట్నం, కొండాపూర్ నుంచి వచ్చే వాహనాలను జీపీఆర్‌ఏ క్వార్టర్స్, గోపీచంద్ అకాడమీ, విప్రో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపునకు తిప్పారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వెహికిల్స్‌ను విప్రో జంక్షన్‌ మీదుగా నానక్‌రామ్‌గూడ, ఓఆర్‌ఆర్‌ గచ్చిబౌలి వైపునకు మరలించినట్లు పోలీసులు తెలిపారు. కొండాపూర్, కొత్తగూడ నుంచి వచ్చే వెహికిల్స్‌ను బొటానికల్ జంక్షన్ వద్ద మసీదు బండ, హెచ్‌సీయూ డిపో, లింగంపల్లి వైపునకు మళ్లించారు. అలాగే ఇంద్రానగర్, మెహిదీపట్నం వైపునకు వచ్చే వెహికిల్స్‌ను జీపీఆర్‌ఏ క్వార్టర్స్ గచ్చిబౌలి ఫ్లైఓవర్, మెహదీపట్నం వైపునకు మళ్లించారు.

Also Read: Omicron Variant: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. కొత్తగా 12 కేసులు నమోదు..!

CM KCR: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే రైతుబంధు నగదు జమ..