AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సమయస్ఫూర్తికి సెల్యూట్.. వ్యక్తిని CPR చేసి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. నెట్టింట ప్రశంసల వర్షం..

CPRతో ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు పోలీసులు. ఇకలేడు అనుకున్న మనిషిని బతికిస్తున్నారు. హైదరాబాద్‌, ఒంగోలులో ఆగిపోయిన మూడు గుండెలను తిరిగి లబ్‌డబ్‌ అనేలా చేశారు.

Hyderabad: సమయస్ఫూర్తికి సెల్యూట్.. వ్యక్తిని CPR చేసి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. నెట్టింట ప్రశంసల వర్షం..
Hyderabad Traffic Police
Shaik Madar Saheb
|

Updated on: Nov 23, 2022 | 7:19 AM

Share

Traffic Constable Saves Life: కేవలం, లా అండ్‌ ఆర్డర్‌ మెయింట్‌నెన్సే కాదు, తమ సమయస్ఫూర్తితో ప్రజల ప్రాణాలను సైతం కాపాడుతున్నారు పోలీసులు. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోన్న బాధితుల విషయంలో వేగంగా రియాక్టవుతున్నారు. CPR చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. హైదరాబాద్‌లో మరో కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిని చాటుకున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ వన్‌లో కరెంట్‌షాక్‌ తగిలిన ఓ వ్యక్తిని రక్షించాడు. కరెంట్‌షాక్‌తో కుప్పకూలిపోయిన బాధితుడికి CPR చేసి ప్రాణం నిలబెట్టాడు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బోలు.. బంజారాహిల్స్‌లో అనుకోకుండా విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు.

అపస్మారక స్థితిలో ఉన్న అతని ఛాతిపై రెండు చేతులు పెట్టి బలంగా ప్రెస్ చేస్తూ.. అతడి శ్వాస ప్రక్రియ సాధారణ స్థాయికి వచ్చేంతవరకు సపర్యలు చేశాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలు ప్రయత్నాలు ఫలించడంతో విద్యుత్ షాక్‌కి గురైన వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. అదే సమయంలో 108 అంబులెన్స్ అక్కడికి చేరుకోని.. ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు బోలు సమయస్ఫూర్తిని కొనియాడుతూ.. అభినందిస్తున్నారు.

వీడియో చూడండి..

ఇటీవల ప్రకాశం జిల్లాలో ఇలాగే ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు కాపాడారు మెరైన్‌ పోలీసులు. వేటపాలెం మండలం రామాపురంలో సముద్ర స్నానం చేస్తూ నీటిలో మునిగిపోయిన బాలికలను కాపాడారు. సముద్రంలో కొట్టుకుపోతున్న అమ్మాయిలను ఒడ్డుకు చేర్చి ప్రాణాలు నిలిపారు. స్పృహకోల్పోయి చలనం లేకుండా పడిపోయిన ఇద్దరు అమ్మాయిలకు CPR చేసి కాపాడారు. ప్రాథమిక చికిత్స తర్వాత వాళ్లిద్దరినీ హాస్పిటల్‌కి తరలించారు మెరైన్‌ పోలీసులు.

సమయస్ఫూర్తితో బాధితుల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్‌ను అభినందించారు ఉన్నతాధికారులు. ప్రజలు సైతం వీళ్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చనిపోయారనుకున్నవాళ్ల ప్రాణాలను నిలబెట్టారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
గూగుల్ క్యాంపస్‌లో తాతయ్య సందడి! చిన్నప్పుడు ఆయన నేర్పారు,ఇప్పుడు
గూగుల్ క్యాంపస్‌లో తాతయ్య సందడి! చిన్నప్పుడు ఆయన నేర్పారు,ఇప్పుడు
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా..?
ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా..?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా? ఇలా చేస్తే చిటికెలో పెద్ద మంట
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా? ఇలా చేస్తే చిటికెలో పెద్ద మంట
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో బీర్ సేల్స్
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో బీర్ సేల్స్
రోబో మూవీ రిపీట్‌.. షో మధ్యలో యువతిని కౌగిలించుకుని హంగామా!
రోబో మూవీ రిపీట్‌.. షో మధ్యలో యువతిని కౌగిలించుకుని హంగామా!
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..