తెలుగు సినీ నటుడు బోస్ మృతి

ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  నాలుగు రోజుల క్రితం కృష్ణానగర్లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిన బోస్ తలకు తీవ్ర గాయమైంది.  దీంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.  నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు.  బోస్.. ఇడియట్, నిన్నే పెళ్లాడత, అల్లరి రాముడు, శివమణి వంటి సినిమాల్లోను, పలు టీవీ సీరియళ్ళలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా […]

తెలుగు సినీ నటుడు బోస్ మృతి
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 28, 2019 | 5:03 PM

ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  నాలుగు రోజుల క్రితం కృష్ణానగర్లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిన బోస్ తలకు తీవ్ర గాయమైంది.  దీంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.  నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు.  బోస్.. ఇడియట్, నిన్నే పెళ్లాడత, అల్లరి రాముడు, శివమణి వంటి సినిమాల్లోను, పలు టీవీ సీరియళ్ళలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా గత కొంతకాలంగా ఆయనకు సినిమా వేశాలు తగ్గాయి. గతంలో ఎక్కువగా హీరోలకు ప్రెండ్ వేషాలు వేశారు. కాగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌కు బోస్ అత్యంత సన్నిహితుడు.