AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సర్కారు విద్యలో గురుకులాల ట్రెండ్.. కట్‌చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

తెలంగాణ గురుకులాలు ప్రభుత్వ విద్యలో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రైవేటుకు దీటుగా సత్తా చాటాయి. అంతా బానే ఉన్నా.. చదువులు పూర్తయ్యాక ఇక్కడ నుంచి వెళ్లిన విద్యార్థుల్లో కనీసం ఒక్కశాతం మంది కూడా స్థిరమైన జాబ్ చేయడం లేదన్న సంచలన విషయాలు బయటికి వచ్చాయి. స్వయంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీ వర్షిణి ఈ విషయాలను చెప్పారు.

Telangana: సర్కారు విద్యలో గురుకులాల ట్రెండ్.. కట్‌చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
Tg
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: May 13, 2025 | 7:51 PM

Share

తెలంగాణ గురుకులాలు ప్రభుత్వ విద్యలో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రైవేటుకు దీటుగా సత్తా చాటాయి. అంతా బానే ఉన్నా.. చదువులు పూర్తయ్యాక ఇక్కడ నుంచి వెళ్లిన విద్యార్థుల్లో కనీసం ఒక్కశాతం మంది కూడా స్థిరమైన జాబ్ చేయడం లేదన్న సంచలన విషయాలు బయటికి వచ్చాయి. స్వయంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీ వర్షిణి ఈ విషయాలను చెప్పారు. అందుకే పూర్వ విద్యార్థుల కోసం జాబ్ ఓరియేంటేషన్ శిక్షణను తెలంగాణ గురుకులాల్లో ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె వివరించారు. ఉన్నతి అనే సంస్థతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నామని.. 238 విద్యాసంస్థల్లో 45 రోజుల ట్రైనింగ్ ఏడాదిలో మూడు బ్యాచ్‌లకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏటా 36 వేలమంది విద్యార్థులకు జాబ్ దొరికేలా శిక్షణ ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు.

గురుకులాల్లో ఇటీవల ఆరా తీయగా 8,9,10 తరగతితో పాటు ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో 40 శాతంకి పైగా నకిలి కుల, ఆదాయ పత్రాలు ఉన్నవారేనని తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీ వర్షిణి తెలిపారు. అందుకే ఈ ఎడాది నుంచి ముందు కుల, ఆదాయ ధృవీకరణ తర్వాత అప్లికేషన్ చేసుకునే అవకాశం ఇచ్చామని.. అక్కడ కూడా తప్పుడు పత్రాలు జోడిస్తే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

గతేడాది గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇవి రాజకీయంగాను రచ్చ రాజేశాయి. దీనిపై స్పందించిన వర్షిణి.. భువనగిరిలో ఓ విద్యార్థి మరణించడం బాధాకారం పలు చోట్ల ఉన్న సమస్యలను పరిష్కరించామని చెప్పారు. డిసెంబర్‌లో అందుబాటులోకి వచ్చిన కామన్ డైట్ మెనూతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదని తెలిపారు. అయితే కావాలని రాజకీయాల కోసం ప్రతిష్టాత్మక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ని బదనాం చేయడం సరికాదని వర్షిణి అన్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 9 పాము కాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. 104 ప్రస్తుతం సొంత భవనాల్లో నడుస్తుండగా మిగిలిన 134 అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటిలో 36 విద్యాసంస్థలకు సొంత భవనాల నిర్మాణ ప్రతిపాదనలు ఉండగా.. మిగిలిన స్కూల్స్ ఇంటిగ్రేటేడ్ స్కూల్స్‌గా కన్వర్ట్ అవుతున్నట్లు ఆమె చెప్పారు.

అడ్మిషన్లలో మరోసారి అదరహో అనిపిస్తున్న గురుకులాలు..

గురుకులాల అడ్మిషన్లకు ఈ ఏడాది కూడా భారీగా అప్లికేషన్లు వచ్చాయి. 57 వేల 523 సీట్లు ఖాళీగా ఉంటే లక్షా 69 వేల 171 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేటగీరిల వారీగా అర్హత ఉన్నవారికి సీట్లను కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేలు సైతం తమసొంత నియోజకవర్గంలో గురుకులాల సీట్ల కేటాయింపు ప్రక్రియను తెలుసుకునే విండో ఇచ్చినట్లు సెక్రటరీ చెప్పారు. గురుకులాల్లో కో-ఎడ్యూకేషన్ ఉండదని స్పష్టం చేశారు. డైవర్షన్ లేకుండా పిల్లలు ఫ్రీగా ఉండేలా వేర్వేరుగానే ఉంటాయని చెప్పారు. కో-ఎడ్యూకేషన్ గా ఉన్న ఒకే ఒక స్కూల్ ని కూడా బాయ్స్, గర్ల్స్ పాఠశాలలుగా విభజన చేస్తున్నట్లు వివరించారు. అమ్మాయిల విద్యాసంస్థల్లో సిబ్బందిగా మహిళలు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మానుకొండురూ నియోజకవర్గం బెజ్జంకిలో గురుకుల అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేయబోతున్నట్టు రెసిడెన్షియల్ విద్యాసంస్థల సెక్రటరీ వర్షిణి తెలిపారు.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు